కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చాలా రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని మాట్లాడాయి. కాగా, ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరగా, ఈరోజు విచారణ జరగనుంది.

కొత్త పార్లమెంట్‌ భవన(New Parliament Building) నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చాలా రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ(PM Modi) పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని మాట్లాడాయి. కాగా, ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరగా, ఈరోజు విచారణ జరగనుంది.

ఈ విషయంపై మునుపటి రోజు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మే 28న‌ కొత్త పార్లమెంటు భవనాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ప్రారంభించేలా సుప్రీంకోర్టు(Supreme Court) కేంద్రాన్ని ఆదేశించాలని డిమాండ్(Demand) చేశారు. "లోక్‌సభ సెక్రటేరియట్(Lok Sabha Secretariat) ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి(President)ని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది" అని పిల్ పేర్కొన్నారు.

మే 18న లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన ప్రకటన.. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్ జారీ చేసిన ఆహ్వానం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని న్యాయవాది జయ సుకిన్(Jaya Sukin) దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్(Congress), టీఎంసీ(TMC), ఆప్(AAP) సహా మొత్తం 21 ప్రతిపక్ష పార్టీలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేకుండానే భవనాన్ని ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం.. రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పార్టీలు ప్ర‌క‌టించాయి.

Updated On 25 May 2023 10:30 PM GMT
Yagnik

Yagnik

Next Story