ప్రముఖ సినీ నటి జయప్రదకు(Jaya Prada) సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. జయప్రదకు కింది స్థాయి కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షపై సుప్రీంకోర్టు(supreme court) స్టే ఇచ్చింది. చెన్నైలో(Chennai) ఉన్న జయప్రద థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో గతంలో చెన్నై ట్రయల్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జయప్రద హైకోర్టును(High court) ఆశ్రయించారు.
ప్రముఖ సినీ నటి జయప్రదకు(Jaya Prada) సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. జయప్రదకు కింది స్థాయి కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షపై సుప్రీంకోర్టు(supreme court) స్టే ఇచ్చింది. చెన్నైలో(Chennai) ఉన్న జయప్రద థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో గతంలో చెన్నై ట్రయల్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జయప్రద హైకోర్టును(High court) ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. శిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా జయప్రద సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై(Petition) విచారించిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు విధించిన ఆరు నెలల శిక్షపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో జయప్రదకు ఉపశమనం లభించింది. జయప్రది పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసే వరకు జైలుశిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత ఉన్నతన్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.