మహారాష్ట్రలోని(Maharastra) అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ(BJP) తరఫున నవనీత్ కౌర్(navneet kaur) పోటీ చేస్తున్నారు. నామనేషన్ వేసేందుకు చివరి రోజు అయిన ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం ఆమె నామినేషన్(Nomination) దాఖలు చేశారు. అయితే ఆఖరి నిమిషం వరకు ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రశ్నార్థంగా మారింది. నామినేషన్ వేసేందుకు ఉదయం నవనీత్ కౌర్ బయలుదేరారు.
మహారాష్ట్రలోని(Maharastra) అమరావతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ(BJP) తరఫున నవనీత్ కౌర్(navneet kaur) పోటీ చేస్తున్నారు. నామనేషన్ వేసేందుకు చివరి రోజు అయిన ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం ఆమె నామినేషన్(Nomination) దాఖలు చేశారు. అయితే ఆఖరి నిమిషం వరకు ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రశ్నార్థంగా మారింది. నామినేషన్ వేసేందుకు ఉదయం నవనీత్ కౌర్ బయలుదేరారు. ఆమె అభ్యర్థిత్వం విషయంలో సుప్రీంకోర్టు(Supreme court) తీర్పు కీలకం కావడంతో స్థానిక దసరా గ్రౌండ్‌లో ఎదురుచూపులు చూస్తూ ఉండాల్సి వచ్చింది. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆమె అనుచరులు మధ్యాహ్నం వరకు టెన్షన్‌తో ఉన్నారు. నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 2021 జూన్ 8వ తేదీన నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు వినియోగించారంటూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. మోసపూరితంగా వ్యహరించినందుకు రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నవనీత్ కౌర్. సరిగ్గా 11:58 గంటలకు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ మొదలు పెట్టింది. కౌర్ కుల ధృవీకరణ పత్రంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. అప్పటి వరకు కాసింత ఆందోళనతో ఉన్న కౌర్ మొహంలో ఆనందం కనిపించింది. తర్వాత తన మద్దతుదారులు, పార్టీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం 1:42గంటలకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు నవనీత్ కౌర్. సినిమా నటిగా ఉన్న నవనీత్ కౌర్ 2011లో బీజేపీ నాయకుడు రవి రాణాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి 2014లో కాంగ్రెస్, ఎన్సీపీ సహకారంతో అమరావతి నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురయ్యింది. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజులకే కాంగ్రెస్, ఎన్సీపీలను వదిలిపెట్టేసి బీజేపీలో చేరారు.