2024 లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ జూలై 18న కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ పలు ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు.. సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు పంపుతుంది. అలాగే తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుంటుంది.
2024 లోక్‌సభ ఎన్నికలు(Loksabha Elections) రానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) జూలై 18న కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ పలు ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు.. సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు పంపుతుంది. అలాగే తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఓం ప్రకాష్ రాజ్‌భర్(Omprakash Rajbhar) కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(Suheldev Bharatiya Samaj Party) మరోసారి ఎన్డీయేలో చేరింది. ఓం ప్రకాష్ రాజ్‌భర్ శనివారం ఢిల్లీ(Delhi)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను కలిశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ను కలిశానని అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనను ఎన్డీయే కుటుంబానికి స్వాగతిస్తున్నాను. రాజ్‌భర్ రాక ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లో ఎన్డీఏను బలోపేతం చేస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్డీఏ చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుందని ట్వీట్ చేశారు.
श्री @oprajbhar जी से दिल्ली में भेंट हुई और उन्होंने प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में आने का निर्णय लिया। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ।
राजभर जी के आने से उत्तर प्रदेश में एनडीए को मजबूती मिलेगी और मोदी जी के नेतृत्व में एनडीए द्वारा… pic.twitter.com/uLnbgJedbF
— Amit Shah (@AmitShah) July 16, 2023
ఓపీ రాజ్‌భర్ మళ్లీ బీజేపీతోనే వెళ్తారని రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చ సాగుతోంది. చర్చకు బలం చేకూర్చుతూ.. సుభాష్ప అధ్యక్షుడు ఓంప్రకాష్ రాజ్‌భర్ శనివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దీంతో బీజేపీతో పొత్తు ఊహాగానాలకు ముగింపు పలికినట్లైంది. ఈ భేటీలో రాజ్‌భర్ పెద్ద కుమారుడు డాక్టర్ అరవింద్ రాజ్‌భర్(Aravind Rajbhar)తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) కూడా పాల్గొన్నారు.
దాదాపు గంటన్నరపాటు జరిగిన భేటీ తర్వాత.. బీజేపీతో సుభాష్ప పొత్తు ఖాయమైంది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం మూడు సీట్లు కావాలనే డిమాండ్‌ను రాజ్‌భర్ అమిత్ షా ముందు ఉంచినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో యూపీలో రెండు సీట్లు, బీహార్‌లో ఒక సీటు కోరింది. బీహార్‌లో సీట్లు ఇచ్చే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, యూపీలో మాత్రం రెండు సీట్లు ఇచ్చే విషయంలో దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది. వీటిలో ఘాజీపూర్, ఘోసి స్థానాలు ఉన్నాయి. రెండు స్థానాల్లోనూ సొంత గుర్తుపైనే పోటీ చేస్తానని రాజ్‌భర్.. షా ముందు షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తన చిన్న కుమారుడు అరుణ్ రాజ్‌భర్(Arun Rajbhar)ను ఘాజీపూర్(Ghazipur) స్థానం నుంచి పోటీ చేయించాలని రాజ్‌భర్.. అమిత్ షాకు ప్రతిపాదించినట్లు కూడా వర్గాలు చెబుతున్నాయి.
బీహార్(Bihar)లో సీటు ఇచ్చే పరిస్థితి రాకపోతే యూపీ(UP)లోని చందౌలీ లేదా అజంగఢ్‌లోని లాల్‌గంజ్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని రాజ్‌భర్ అమిత్ షా ముందు కండిషన్ కూడా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే బీహార్ లో సీటు రాని పక్షంలో యూపీలో మొత్తం మూడు సీట్లు కావాలని అడిగారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.
దీంతో పాటు సామాజిక న్యాయ కమిటీ నివేదిక అమలు, రాజ్‌భర్ కులాన్ని షెడ్యూల్డ్ తెగల్లో చేర్చడంతోపాటు అనేక ఇతర అంశాలపై కూడా షాతో రాజ్‌భర్ చర్చించారు. రాజ్‌భర్ చేసిన పలు ప్రతిపాదనలకు అమిత్ షా అంగీకరించినట్లు సమాచారం. దీంతో రాజ్‌భర్ కూడా సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.