హర్యానా అసెంబ్లీ ఎన్నికలు(Haryana assembly elections) దగ్గరపడుతున్నాయి.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు(Haryana assembly elections) దగ్గరపడుతున్నాయి. ప్రధానపార్టీలన్నీ రాజకీయ వ్యూహరచన చేసుకుంటున్నాయి. ప్రస్తుతం హిసార్‌(Hisar Constituency) అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. అందుకు కారణం సావిత్రి జిందాల్‌(Savitri Jindal) ఇండిపెండెంట్ అభ్యర్థిగా(Independent candidate) బరిలో దిగడమే! ఆమె ఎవరంటే కురుక్షేత్ర నగర ఎంపీ నవీన్‌ జిందాల్‌ తల్లి. నామినేషన్‌ వేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. 'హిసార్‌ ప్రజలు నా కుటుంబ సభ్యులు. నా భర్త ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. జిందాల్ కుటుంబం ఎప్పుడూ హిసార్‌కు సేవ చేస్తూనే ఉంది. ప్రజల అంచనాలకు అనుగుణంగా,వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పూర్తిగా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సావిత్రి జిందాల్‌ చెప్పుకొచ్చారు. హిసార్‌ నుంచి రాష్ట్ర మంత్రి , బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కమల్‌ గుప్తా కూడా పోటీ చేస్తున్నారు. చిత్రమేమిటంటే సావిత్రి జిందాల్‌ కుమారుడు నవీన్‌ జిందాల్‌ బీజేపీ ఎంపీ! కొడుకు బీజేపీ ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కమల్‌గుప్తాపై సావిత్రి పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. అలాగని ఆమె బీజేపీ రెబల్‌ అభ్యర్థి కూడా కాదు. ఆమెకు బీజేపీ సభ్యత్వం కూడా లేదు. కాకపోతే నవీన్‌ జిందాల్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. సావిత్రి జిందాల్ 2005, 2009లలో హిసార్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. 2013లో సింగ్ హుడా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో సావిత్రి జిందాల్‌,ఆమె కుమారుడు నవీన్ జిందాల్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరారు.నవీన్‌ జిందాల్‌ బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆమె ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా, సావిత్రి జిందాల్‌ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 29.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చోటు సంపాదించారు

Eha Tv

Eha Tv

Next Story