తమిళనాడులో(Tamilnadu) ఈసారి గెలిచి తీరతామని బీజేపీ(BJP) ప్రకటించుకుంది. ఎగ్జిట్‌పోల్స్(Exitpolls) కూడా తమిళనాడులో బీజేపీకి రెండు సీట్లు ఇచ్చాయి. అక్కడ బీజేపీ సున్నా చుట్టింది. విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సినీ నటి రాధిక మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తమిళనాడులో(Tamilnadu) ఈసారి గెలిచి తీరతామని బీజేపీ(BJP) ప్రకటించుకుంది. ఎగ్జిట్‌పోల్స్(Exitpolls) కూడా తమిళనాడులో బీజేపీకి రెండు సీట్లు ఇచ్చాయి. అక్కడ బీజేపీ సున్నా చుట్టింది. విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సినీ నటి రాధిక మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాపం తన భార్య విజయం సాధించాలని, నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటూ సినీ నటుడు శరత్ కుమార్(sharath kumar) చేసిన ప్రత్యేక పూజలు ఫలించలేదు. పెట్టిన పొర్లు దండాలు కూడా వృధా అయ్యాయి. విరుదునగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాణిక్యం టాగూర్(Manikyam Tagore) గెలుపుబాటలో పయనిస్తున్నారు. డీఎండీకే(DMDK) అభ్యర్థి విజయ ప్రభాకరన్ రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన రాధిక మూడో స్థానంలో నిలిచారు.