అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) నిర్మించేవరకు ఎవరితో మాట్లాడకుండా 30 ఏళ్ల పాటు ఓ మహిళ మౌనవ్రతం(silence Vow) పాటిస్తున్నారు. రామమందిరం కోసం 30 ఏళ్లుగా మౌనంగా ఉంటున్న సరస్వతిదేవి(Saraswathi) ఈరోజు రామాయలం ప్రారంభోత్సవ కోసం అయోధ్య చేరుకున్నారు.

Saraswati Devi
అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir) నిర్మించేవరకు ఎవరితో మాట్లాడకుండా 30 ఏళ్ల పాటు ఓ మహిళ మౌనవ్రతం(silence Vow) పాటిస్తున్నారు. రామమందిరం కోసం 30 ఏళ్లుగా మౌనంగా ఉంటున్న సరస్వతిదేవి(Saraswathi) ఈరోజు రామాయలం ప్రారంభోత్సవ కోసం అయోధ్య చేరుకున్నారు. రాముడికే తన జీవితం అంకితమంటూ 30 ఏళ్లపాటు మౌనవ్రతం పాటించారు. ఇక నుంచి తాను అయోధ్యలోనే ఉంటానని ప్రకటించారు. రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్యగోపాల్ స్ఫూర్తితో 1992 నుంచి ఆమె మౌనంగా ఉంటున్నారు.
30 ఏళ్ల క్రితం మౌన ప్రతిజ్ఞ చేసినజార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన మహిళ సరస్వతీదేవి ఎట్టకేలకు జనవరి 22న మళ్లీ మాట్లాడనున్నారు. బాబ్రీ మసీదు(Babri masjid) కూల్చివేత సమయంలో సరస్వతీ దేవి మౌన ప్రతిజ్ఞ చేశారు. పవిత్ర నగరమైన అయోధ్యలో సరయూ నది ఒడ్డున రామమందిరం నిర్మించే వరకు మౌనం వీడబోనని ఆమె నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ మౌనం పాటించడంతో ఆమెకు 'మౌని మాత' అనే పేరు వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున ఆమె మౌనానికి తెరపడనుంది. అయోధ్య రామ్ లల్లా ముందు మాత్రమే తొలి పలుకు పలకనున్నట్లు ఆమె బంధువులు వెల్లడించారు.
