ఇటీవల డీప్‌ ఫేక్‌(Deep Fake) అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదం వింటనే చాలు సెలబ్రిటీలు వణికిపోతున్నారు. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. లేటెస్ట్‌గా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూతురు సారా తెందూల్కర్‌(Sara Tendulkar) కూడా డీప్‌ఫేక్‌పై రియాక్టయ్యారు.

ఇటీవల డీప్‌ ఫేక్‌(Deep Fake) అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదం వింటనే చాలు సెలబ్రిటీలు వణికిపోతున్నారు. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. లేటెస్ట్‌గా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూతురు సారా తెందూల్కర్‌(Sara Tendulkar) కూడా డీప్‌ఫేక్‌పై రియాక్టయ్యారు. తన డీప్‌ఫేక్‌ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినట్టు తెలిపారు. 'మన యాక్టివిటీలు, మన ఆనందవిషాదాలు నలుగురితో పంచుకోవడానికి సోషల్‌ మీడియా అద్భుతమైన ఫ్లాట్‌ఫామ్‌. కానీ కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. సోషల్‌ మీడియాలో నా డీప్‌ఫేక్‌ వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఎక్స్‌ (ట్విటర్‌)లో కొందరు నా పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. నాకు ఎక్స్‌లో అకౌంటే లేదు. ఫేక్‌ అకౌంట్లను ఎక్స్‌ గుర్తించి వాటిని సస్పెండ్‌ చేస్తుందని ఆశిస్తున్నాను' అని సారా తెందూల్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా తెందూల్కర్‌ కలిసి ఉన్న మార్ఫింగ్‌ ఫోటో ఒకటి ఇటీవల వైరల్‌ అయ్యింది. తన సోదరుడు అర్జున్‌ తెందూల్కర్‌తో ఉన్న ఫోటోను కొందరు డీప్‌ఫేక్‌ చేశారు. అర్జున్‌ ఫేస్‌ ప్లేస్‌లో గిల్‌ ఫోటోను మార్చి వైరల్‌ చేశారు. ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా, కాజోల్‌, కత్రినా కైఫ్‌ డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే! దీనిపై చర్చించడానికి కేంద్రప్రభుత్వం త్వరలో సోషల్‌ మీడియా సంస్థలతో సమావేశం కానుంది. అవసరమైతే డీప్‌ఫేక్‌పై చట్టం తీసుకువస్తామని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

Updated On 22 Nov 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story