ఎలక్టోరల్ బాండ్స్‌(Electoral Bonds) వివరాలను వెల్లడించడం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు(SBI) ఇష్టం లేనట్టుగా ఉంది. సుప్రీంకోర్టు గట్టిగా తిట్టబట్టి ఏదో ముక్తసరిగా వివరాలు తెలిపింది. కాకపోతే ఎన్నికల కమిషన్‌కు(Election Commission) ఇచ్చిన సమాచారంలో ఎలక్టోరల్‌ బాండ్ల నంబర్లు ఇవ్వలేదు. దాంతో ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల మేరకు బాండ్ల పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల రాజ్యంగ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎలక్టోరల్ బాండ్స్‌(Electoral Bonds) వివరాలను వెల్లడించడం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు(SBI) ఇష్టం లేనట్టుగా ఉంది. సుప్రీంకోర్టు గట్టిగా తిట్టబట్టి ఏదో ముక్తసరిగా వివరాలు తెలిపింది. కాకపోతే ఎన్నికల కమిషన్‌కు(Election Commission) ఇచ్చిన సమాచారంలో ఎలక్టోరల్‌ బాండ్ల నంబర్లు ఇవ్వలేదు. దాంతో ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల మేరకు బాండ్ల పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల రాజ్యంగ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్‌కు ఎస్‌బీఐ ఇచ్చిన వివరాలలో ఎలక్టోరల్‌ బాండ్ల నంబర్లు వెల్లడించకపోవడం వల్ల ఏ కంపెనీ ఏ రోజు ఏ రాజకీయ పార్టీకి ఎంత విరాళమిచ్చిందనే నిర్ధిష్ట సమాచారం లేదు.
ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్‌ చేసింది. ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌ సంస్థ ఈ ఏడాది జనవరి వరకు అత్యధికంగా 1.368 కోట్ల రూపాయల విలువ చేసే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్టు డేటాలో తేలింది. పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్లు కొన్న ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్న కుతూహలమూ పెరిగింది. శాంటియాగో మార్టిన్ ఒకప్పుడు మయన్మార్‌లో సాదాసీదా కూలి! కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఏమిటాయన కథ?

శాంటియాగో మార్టిన్‌(Santiago Martin) పుట్టింది ఇండియాలోనే కానీ బాల్యమంతా మయన్మార్‌లో గడిచింది. అక్కడ చాన్నాళ్ల పాటు కూలీగా పని చేశాడు. 13 ఏళ్ల వయసులో ఇండియాకు తిరిగి వచ్చాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలు పెట్టాడు. అచిరకాలంలోనే తన వ్యాపారాన్ని తమిళనాడు అంతటా వ్యాపింపచేశాడు. తర్వాత కర్ణాకట, కేరళతో దేశమంతటా విస్తరింపచేశాడు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు భూటాన్‌, నేపాల్‌లో కూడా తన లాటరీ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. రియల్‌ఎస్టేట్‌ రంగంలో కాలు పెట్టాడు. అందులో లాభాలు ఆర్జించిన తర్వాత టెక్స్‌టైల్స్‌, నిర్మాణ రంగంలో దిగాడు. అక్కడా సక్సెసయ్యాడు. హోటల్స్‌ పెట్టాడు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో లాటరీలు చట్టబద్ధం. ఆయా రాష్ట్రాలలో శాంటియాగో మార్టిన్‌ దాదాపు వెయ్యి మందిని నియమించుకుని లాటరీ వ్యాపారం సాగిస్తున్నాడు. నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలలో అయితే తన కంపెనీకి చెందిన డియర్ లాటరీ ఆధిపత్యం చెలాయిస్తున్నది. మార్టిన్‌ ప్రస్తుతం ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వరల్డ్‌ లాటరీ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్‌ కూడా ఉంది. ఇతడిపై బోల్డన్ని ఆరోపణలు ఉన్నాయి. 2008లో సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4,500 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డాడు శాంటియాగో మార్టిన్‌. బహుమతి పొందిన టికెట్లను మార్టిన్‌ కంపెనీలు పెంచి చూపడంతో సిక్కిం సర్కారుకు 910 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని దర్యాప్తు సంఘాలు తేల్చాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా మార్టిన్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఫ్యూచర్‌ గేమింగ్ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ సంస్థపై ఈడీ అనేక సార్లు దాడులు చేసింది. దాదాపు 603 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో అమ్ముతున్నారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే దాడులు జరిగాయి.

Updated On 15 March 2024 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story