పశ్చిమబెంగాల్(West Bengal) రాష్ట్రం భీర్‌భూమ్ జిల్లా మురారై ప్రాంతానికి చెందిన సంగీత(Sangeetha), అరుణ్‌ప్రసాద్‌కు(Arun Prasad) 28 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు సంతానం కలగలేదు. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండడంతో సంతానం కలగలేదు.
పశ్చిమబెంగాల్(West Bengal) రాష్ట్రం భీర్‌భూమ్ జిల్లా మురారై ప్రాంతానికి చెందిన సంగీత(Sangeetha), అరుణ్‌ప్రసాద్‌కు(Arun Prasad) 28 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు సంతానం కలగలేదు. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండడంతో సంతానం కలగలేదు. ఐవీఎఫ్(IVF) చికిత్స ద్వారా ఈ దంపతులు సంతానానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా కోల్‌కతాలోని ల్యాబ్‌లో అరుణ్‌ప్రసాద్ వీర్యాన్ని(Sperm) ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత కోవిడ్(covid) రావడంతో అరుణ్‌ప్రసాద్ మృతి చెందాడు. దీంతో ఆమె కృంగి పోయింది. అత్తింటివారు ఆమెను పట్టించుకోలేదు. భర్త నడిపే కిరాణం షాపుతో ఆమె బతుకు వెళ్లదీస్తోంది. దీంతో తన భర్త వీర్యంతో ఆమె గర్భవతి కావాలనుకుంది. ఐవీఎఫ్ చికిత్స ద్వారా భర్త వీర్యాన్ని సంగీత అండంతో కలిపి ఎంబ్రియోను ఆమె గర్బాశయంలోకి ప్రవేశపెట్టడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇన్నేళ్ల తన కల సాకారం కావడంతో సంతోషంగా ఉన్నానని సంగీత తెలిపింది.