మహా శివరాత్రి(Shiva Ratri) పూజల కోసం భక్తులు సర్వసన్నద్ధమవుతున్నారు. శివాలయాలను ముస్తాబు చేస్తున్నారు. మిగతా భక్తుల సంగతేమిటో కానీ రాజస్థాన్‌లోని(Rajasthan) బన్స్వారా(Banswara) జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ వెలసిన పరమశివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిస్తాడు. మిగతా రోజులు కనిపించకుండా మాయమవుతాడు.
మహా శివరాత్రి(Shiva Ratri) పూజల కోసం భక్తులు సర్వసన్నద్ధమవుతున్నారు. శివాలయాలను ముస్తాబు చేస్తున్నారు. మిగతా భక్తుల సంగతేమిటో కానీ రాజస్థాన్‌లోని(Rajasthan) బన్స్వారా(Banswara) జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ వెలసిన పరమశివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిస్తాడు. మిగతా రోజులు కనిపించకుండా మాయమవుతాడు. మహి, అనస్ నదుల(Anas Rivers) సంగమం దగ్గర ఉన్న ఈ శివాలయానికి(shivalayam) రెండు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు ఈ దేవాలయం అదృశ్యమవుతుంది. నాలుగు అడుగుల నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. వందల సంవత్సరాలుగా ఇలా జరుగుతున్న ఆలయానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. ఈ గుడి మునిగిపోవడానికి కారణమేమిటంటే గుజరాత్‌లోని కడనా డ్యామ్‌లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడమే! ఈ ఆలయాన్ని ఇటుక, రాయి, సున్నంతో నిర్మించార. సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా(Sangameshwar Mahadev Temple) పేరుగాంచిన ఈ గుడి బన్స్వారాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఈ ప్రాంతంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది.