బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మణికట్టును మరో ఖరీదైన వాచ్‌ అలంకరించింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ మణికట్టును మరో ఖరీదైన వాచ్‌ అలంకరించింది. ఖరీదైన వాచ్‌లను పెట్టుకోవడం సల్మాన్‌కు కొత్తేమీ కాదు. వజ్రాలు పొదిగిన వాచ్‌లంటే చాలా ఇష్టమతడికి! లేటెస్ట్‌గా ఓ ఖరీదైన వాచ్‌తో ఫోటోకు పోజిచ్చాడు. అతడు ధరించింది జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్‌. అంతేనా ... ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం కూడా చేసుకున్నాడు. జాకబ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు(714 Diamonds) పొదిగిన గడియారాన్ని(Watch) సల్మాన్‌కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్‌ వాచ్‌ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్‌(Salman) అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్‌ చేశాడు. జాకబ్‌ అండ్ కో కంపెనీ వాచ్‌(Jacob&Co-Company Watch)లకు ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచ్‌లు కేవలం 18 మాత్రమే ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్‌పై 152 ఎమరాల్డ్‌ కట్‌ డైమండ్స్‌, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్‌తో ,బ్రాస్‌లెట్‌లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్‌తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని తయారుచేశారు. జాకబ్ అండ్ కో వెబ్‌సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర 41.94 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదైన వాచ్‌ పెట్టుకున్నందుకు సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. సల్మాన్‌ ధరించడం వల్లే దానికి విలువ వచ్చిందని అంటున్నారు.

ehatv

ehatv

Next Story