కర్ణాటకలో(Karnataka) హంగ్ ఏర్పడితే బీజేపీకి(BJP) అమ్ముడుపోవద్దని తృణమూల్ కాంగ్రెస్(Congress) పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే(Saketh Gokhale) శనివారం ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కర్ణాటక ఎన్నికల(karnataka elections) ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సాకేత్ గోఖలే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు.

Saketh Gokhle
కర్ణాటకలో(Karnataka) హంగ్ ఏర్పడితే బీజేపీకి(BJP) అమ్ముడుపోవద్దని తృణమూల్ కాంగ్రెస్(Congress) పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే(Saketh Gokhale) శనివారం ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కర్ణాటక ఎన్నికల(karnataka elections) ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో సాకేత్ గోఖలే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. హంగ్ అసెంబ్లీ అయితే బీజేపీకి అమ్ముడుపోవద్దు. కర్ణాటకలో ఈరోజు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ఇది నా విజ్ఞప్తి అని ట్వీట్(tweet) చేశారు. రాక్షసుల పార్టీలో చేరడం కంటే జైలుకెళ్లడం ఉత్తమం. మీకు ఓట్లు వేసిన ప్రజలను గుర్తుంచుకుని.. తగిన నిర్ణయం తీసుకోండని ట్వీట్ లో కోరారు.
ఇదిలావుంటే.. అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు(special Court) సాకేత్ గోఖలేకు రెగ్యులర్ బెయిల్(regular bail) మంజూరు చేసింది. క్రౌడ్ ఫండింగ్‌లో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విరాళంగా సేకరించిన రూ. 1.07 కోట్ల మొత్తాన్ని దుర్వినియోగం చేసినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆయన్ని అరెస్టు చేసింది. మే 6న అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
