రంగుల పండుగ హోలీ(Holi) దగ్గరకు వచ్చేసింది. అందరూ పండుగ సన్నాహాల్లో ఉన్నారు. కామదహనం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశమంతా వసంతోత్సవం కోసం ఎదురుచూస్తున్నది. ఒక్క గ్రామం మినహా! ఆ గ్రామంలో హోలీ పండుగ అసలు చేసుకోరు.

రంగుల పండుగ హోలీ(Holi) దగ్గరకు వచ్చేసింది. అందరూ పండుగ సన్నాహాల్లో ఉన్నారు. కామదహనం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశమంతా వసంతోత్సవం కోసం ఎదురుచూస్తున్నది. ఒక్క గ్రామం మినహా! ఆ గ్రామంలో హోలీ పండుగ అసలు చేసుకోరు. కనీసం పిండివంటలు కూడా వండుకోరు. బీహార్‌లో(Bihar) ఉందా గ్రామం. ముంగేర్‌(Munger) జిల్లాలో ఉన్న ఆ ఊరి పేరు సజువా(Sajua). హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో అనుకోని ప్రమాదాలు సంభవిస్తాయన్నది గ్రామ ప్రజల నమ్మకం. అందుకే హోలీ పండుగకు దూరంగా ఉంటారు. రెండు వేల మంది నివసిస్తున్న ఈ గ్రామంలో హోలీ రోజున పిండివంటలు కూడా చేసుకోరు. చేసుకుంటే ఆ కుటుంబానికి ఆపదలు వస్తాయన్ని అంటుంటారు. అన్నట్టు ఈ గ్రామానికి సతీ అనే పేరు కూడా ఉంది. సుమారు రెండున్నర శతాబ్దాల కిందట ఈ గ్రామంలో ఓ విషాదం చోటు చేసుకున్నదట! అందుకే హోలీకి దూరంగా ఉంటారు. కాకపోతే ప్రతి ఏటా ఏప్రిల్ 14న ఇక్కడ హోలికా దహనం జరుగుతుంది.

Updated On 23 March 2024 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story