తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి(Guru pournami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి(Guru pournami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. సాయిబాబా ఆలయాలన్నీ(Sai baba temple) భక్తులతో కిటకిటలాడు తున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. సాయిబాబాను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ లోని దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గురువుకు సమాజంలో అత్యత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయంలో భాగంగా వస్తున్నది.. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా పూజించడమనేది ఆనవాయితీ. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువు. విద్యా బుద్ధులు నేర్పి వికాసం వైపు నడింపే మహోన్నత వ్యక్తి గురువు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్వహించడం ఆచారం. వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజల నమ్మకం. జగతిని జాగృత పరిచిన గురు దేవులను నేడు పూజించడం ఆనవాయితీ..