సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్(Subrata Roy) మంగళవారం ముంబాయి(Mumbai0లో కన్నుమూశారు. కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా కోకిలాబెన్ ఆసుప్రతిలో ఆయన అంతిమశ్వాస విడిచారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో సుబ్రతా రాయ్ కూడా ఒకరు. సుబ్రతారాయ్‌ను సహారాశ్రీ అని కూడా పిలుస్తుంటారు.
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్(Subrata Roy) మంగళవారం ముంబాయి(Mumbai0లో కన్నుమూశారు. కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా కోకిలాబెన్ ఆసుప్రతిలో ఆయన అంతిమశ్వాస విడిచారు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో సుబ్రతా రాయ్ కూడా ఒకరు. సుబ్రతారాయ్‌ను సహారాశ్రీ అని కూడా పిలుస్తుంటారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో సుబ్రతారాయ్‌కు చక్కటి ఫ్రెండ్‌షిప్‌ఉంది. ఏబీసీఎల్ కార్పొరేషన్ స్థాపన తర్వాత అమితాబ్ బచ్చన్ పీలకలోతు నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుడు అమితాబ్‌కు సాయం అందించింది సుబ్రతారాయే! వీరి స్నేహం అక్కడి నుంచే మొదలయ్యింది. అసలు వీరిద్దరిని కలిపింది సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్. ఈ ముగ్గరు మంచి మిత్రులుగా మెలిగారు. సుబ్రతారాయ్ మేనకోడలు శివాంక పెళ్లి 2010లో జరిగింది. ఈ వేడుకకు అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్‌లు కూడా వచ్చారు. ఇవాళ లక్నోలో సుబ్రతారాయ్ అంత్యక్రియలు జరుగుతాయి.