ప్రతిచోటా కాంతి ఉన్నప్పుడే సమాజంలో చీకటిని తొలగించవచ్చు.

ప్రతిచోటా కాంతి ఉన్నప్పుడే సమాజంలో చీకటిని తొలగించవచ్చు. దీపావళి(diwali) అంటేనే దీపాల పండుగ.అందమైన దీపాలకాంతులతో ప్రతి ఇల్లు కళకళలాడాలని అష్ట లక్ష్ములు మీ గృహములలో నెలవై సకల శుభాలను, ధైర్య, స్థైర్య, సాహసోపేతమైన విజయాలను, బుద్ది, జ్ఞాన, విద్యలను, సిరి, సంపదలను, సుఖ సంతోషాలను, భోగ భాగ్యాలను, ఎల్లవేళలా ప్రసాదించాలని కోరుకుంటాం. అయితే దీపావళి రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు పటాకులు కాల్చేందుకు ఇష్టపడుతారు. దీపావళి పటాకులు కాల్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

పటాకులు(Crackers) కాల్చినప్పుడు అవి మన మీద పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చిన్న పిల్లలు పటాకులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా(Cautious) ఉండాలని అంటున్నారు. ముందుగా పటాకులు కాల్చేందుకు కావాల్సిన అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని చెప్తున్నారు. ఓపెన్ ప్లేస్‌లో పటాకులు కాల్చితే సురక్షితమని.. ఇళ్ల మధ్యలో, పార్కింగ్(Parking) ప్రదేశాల్లో బాణాసంచా కాల్చకూడదు. పార్కింగ్‌లో ఉన్న వాహనాల్లో నిప్పు కణికలు(Fire sparks) పడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టపాకాయలు కాల్చే సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు షార్ట్స్‌ వేసుకోవడం మంచిది కాదు. సౌకర్యంగా ఉండేలా, చర్మాన్ని రక్షించేలా పొడవైన దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. పటాకులు కాల్చే సమయంలో పక్కనే బకెట్‌ నీరు లేక ఇసుకను ఉంచుకోవాలి. చిన్నారులు టపాకాయలు కాల్చే సమయంలో కొంచెం అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కాబట్టి.. పెద్దవారు వారి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి ప్రమాదం గురించి చెప్తూనే జాగ్రత్తగా పండగ సెలబ్రేట్‌ చేసుకోవాలి. పొరపాటున టపాకాయల్లోని సల్ఫర్, గన్‌పౌడర్‌ వంటికి కళ్లల్లో పడితే మీకు కళ్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం మీకు కళ్ల నుంచి నీరు కారడం, మంట లేదా దురద వంటి సమస్యలకి దారితీయవచ్చు. కాలిన ప్రాంతాన్ని నీటితో నెమ్మదిగా తొలుత శుభ్రం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టతో గాయాన్ని నెమ్మదిగా తుడవాలి. కానీ గాయంపై పసుపులాంటివి వేయకూడదు. గాయం పెద్దదయితే వెంటనే వైద్యులను సంప్రదించాలు. అయితే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే వాటికంటే కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు ఇతర ఫ్యాన్సీ ఐటెమ్స్‌తో దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలి

Eha Tv

Eha Tv

Next Story