మాజీ క్రికెట్ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) భద్రతా సిబ్బందిలో(Security Guard) ఒకరు ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. స్టేట్ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ -ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు(SRPF) చెందిన 39 ఏళ్ల ప్రకాశ్‌ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లా జమ్నేర్‌ ఆయన స్వస్థలం.

మాజీ క్రికెట్ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) భద్రతా సిబ్బందిలో(Security Guard) ఒకరు ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. స్టేట్ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ -ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు(SRPF) చెందిన 39 ఏళ్ల ప్రకాశ్‌ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లా జమ్నేర్‌ ఆయన స్వస్థలం. సెలవులపై అక్కడికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత కారణాల వల్లనే జవాన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. ఆత్మహత్య ఘటనపై జమ్మేర్‌ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ క‌ల్పిస్తున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ఎస్ఆర్పీఎఫ్ వ్య‌క్తిగ‌తంగా ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ది.

Updated On 15 May 2024 5:59 AM GMT
Ehatv

Ehatv

Next Story