ముంబై ఇండియన్స్(Mumbai Indians) మెంటార్(Mentor) పదవికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) త్వరలోనే గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఇటీవల రోహిత్ శర్మను(Rohit sharma) కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఫ్రాంచైజీ..ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలిగించడంపై సచిన్ టెండూల్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ముంబై ఇండియన్స్ రథసారథి రోహిత్ శర్మను తప్పించిన షాక్ నుంచి తేరుకోకముందే అభిమానులకు మరో చేదువార్త ఆందోళనకు గురి చేస్తోంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ఆసంతృప్తిగా ఉన్న క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సచిన్ తన నిర్ణయాన్ని ముంబై యాజమాన్యానికి తెలియజేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే తనపై వస్తున్న వార్తలు వట్టి రూమర్సేనని సచిన్ కొట్టిపారేసినట్టు సమాచారం.
ఇక 2014 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ మెంటార్‌గా సచిన్ తన సేవలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఆయన 5 సీజన్లపాటు ముంబై ఇండియన్స్‌కు సచిన్ ప్రాతినిథ్యం వహించాడు. వచ్చే సీజన్‌లో కూడా ముంబై మెంటార్‌గా సచిన్ కొనసాగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.