సచిన్ పైలట్.. రాజస్థాన్(Rajasthan) సీఎం పదవికై ఆశపడి భంగపడిన నాయకుడు. అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)కు అధిష్టానం అవకాశమివ్వడంతో పార్టీపై అలకతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అటు పార్టీకి, ఇటు సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తన అసహనాన్ని చాటుతూనే ఉంటాడు. తాజాగా.. జైపూర్‌లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు కూర్చున్నాడు సచిన్ పైలట్(Sachin Pilot). అశోక్ గెహ్లాట్ వాగ్దానాలు, మాజీ సీఎం వసుంధర రాజే గత ప్రభుత్వంలో అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం నిరాహార దీక్ష ప్రధాన […]
సచిన్ పైలట్.. రాజస్థాన్(Rajasthan) సీఎం పదవికై ఆశపడి భంగపడిన నాయకుడు. అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)కు అధిష్టానం అవకాశమివ్వడంతో పార్టీపై అలకతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అటు పార్టీకి, ఇటు సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తన అసహనాన్ని చాటుతూనే ఉంటాడు. తాజాగా.. జైపూర్‌లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు కూర్చున్నాడు సచిన్ పైలట్(Sachin Pilot). అశోక్ గెహ్లాట్ వాగ్దానాలు, మాజీ సీఎం వసుంధర రాజే గత ప్రభుత్వంలో అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు గెహ్లాట్, పైలట్‌ల మధ్య గొడవ అంతర్గతంగానే సాగింది. నేడు అది రోడ్డు మీదికొచ్చింది.
అయితే.. పైలట్ నిరాహార దీక్షను పార్టీ వ్యతిరేక చర్యగా రాజస్థాన్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా అభివర్ణించారు. సచిన్ పైలట్ నిరాహార దీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది పార్టీ వ్యతిరేక చర్య అని రాజస్థాన్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధవా ఒక ప్రకటన విడుదల చేశారు. తన సొంత ప్రభుత్వంతో ఆయనకు ఏదైనా సమస్య ఉంటే మీడియా, ప్రజల్లో కాకుండా పార్టీ వేదికలపై చర్చించుకోవచ్చు. గత 5 నెలలుగా నేనే ఏఐసీసీ ఇన్‌చార్జిగా ఉన్నాను. పైలట్ జీ నాతో ఈ అంశంపై ఎప్పుడూ చర్చించలేదని రాంధావా అన్నారు. నేను అతనితో టచ్‌లో ఉన్నాను. అతను కాంగ్రెస్ పార్టీకి ఆస్తి కాబట్టి ప్రశాంతంగా చర్చలు జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే(Vasundhara Raje)పై అవినీతి ఆరోపణలపై ఎలాంటి ఫిర్యాదు చేసినా సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోలేదని సచిన్ పైలట్ అంటున్నా.. గెహ్లాట్‌కే కాంగ్రెస్ అధిష్టానం మద్దతుగా నిలిచింది. దీంతో నిరసనగా ఏప్రిల్ 11న నిరాహారదీక్షను ప్రకటించాడు సచిన్ పైలట్. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పథకాలను అమలు చేసిందని.. అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టిందని.. ఇవి ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయని కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) ఒక ప్రకటనలో తెలిపారు. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర అత్యద్భుతంగా విజయవంతమైందని అన్నారు.