అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. పవిత్ర శబరిమల ఆలయం ఈనెల 17 నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. శుక్రవారం నుంచి భక్తులకు అయ్యప్ప స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 17 నుంచి మకరవిళక్కు వేడుకలు ప్రారంభమవుతాయి. ఆతర్వాత రెండు నెలల పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఇందుకోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు కేరళ మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాంకేతికతను ఉపయోగించామని.. సీసీ కెమెరాల సంఖ్య పెంచామని, గట్టి బందోబస్తు చేపడతామని మంత్రి రాధాకృష్ణ తెలిపారు. లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారని, అందు కోసం డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు. శబరిమల మకరవిళక్కు పండగ సీజన్‌లో భక్తులు ఏటా లక్షల మంది వస్తారన్నారు. నిలాక్కళ్,పంబా, సన్నిధానం ఏరియాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా.. పంబా నుంచి సన్నిధానానికి వచ్చే రూట్‌లో 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శబరిమల క్షేత్రం తెరవడం, ఏర్పాట్లపై సీఎం కూడా సమీక్ష నిర్వహించారు. మలయాళ నెల వృశ్చికం తొలిరోజున మండలం మకరవిళక్కు వేడుకలు ప్రారంభమవుతాయి. జనవరిలో మకరి జ్యోతి దర్శనం ఉంటుంది. తదనంతరం ఆలయాన్ని అధికారనులు మూసివేస్తారు. శబరిమల, పంబాలో పారిశుద్ధ్య పనుల్లో విశుద్ది సేన నిమగ్నమైంది. ఈ ఏడాది ఈ-కానిక్క సదుపాయాన్ని సమగ్రంగా ఏర్పాట్లు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిత్యావసర వస్తుల ధరల జాబితాను ఐదు భాషల్లో ప్రచురించారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా నిరోధించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.