శబరిమలకు(Shabarimala) ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇసుకేస్తే రానంత మంది అయ్యప్ప సన్నిధానంలో ఉన్నారు. శబరిమలకు వెళ్లే అన్ని దారులు కిక్కిరిసిపోయాయి. ఇవాళ మండల పూజ జరుగుతుంది.
శబరిమలకు(Shabarimala) ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇసుకేస్తే రానంత మంది అయ్యప్ప సన్నిధానంలో ఉన్నారు. శబరిమలకు వెళ్లే అన్ని దారులు కిక్కిరిసిపోయాయి. ఇవాళ మండల పూజ జరుగుతుంది. మండల పూజకు(Mandala puja) ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(Travancore Devaswam Board) అన్ని ఏర్పాట్లు చేసింది. పూజ తర్వాత బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30వ తేదీన తిరిగి ఆలయ తలుపులు తెరచుకుంటాయి. నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.జనవరి 15న మకరవిలక్కు పూజ నిర్వహించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీ.ఎస్. ప్రశాంత్ తెలిపారు.