శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి(Ayyappa Swamy)ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలలో విమానాశ్రయ నిర్మాణానికి(sabarimala airport) కేంద్రం(Central) పచ్చజెండా ఊపింది. కొట్టాయం జిల్లా(Kottayam District)లోని చెరువల్లి ఎస్టేట్(Cheruvally estate)లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 2,266 ఎకరాలు కేటాయించారు. అదనంగా 307 ఎకరాల భూమిని సేకరించనున్నారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే..

Sabarimala Airport
శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి(Ayyappa Swamy)ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలలో విమానాశ్రయ నిర్మాణానికి(Sabarimala Airport) కేంద్రం(Central) పచ్చజెండా ఊపింది. కొట్టాయం జిల్లా(Kottayam District)లోని చెరువల్లి ఎస్టేట్(Cheruvally estate)లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 2,266 ఎకరాలు కేటాయించారు. అదనంగా 307 ఎకరాల భూమిని సేకరించనున్నారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే.. 3.5 కి.మీ పొడవుతో రాష్ట్రంలోనే అత్యంత పొడవైన విమానాశ్రయంగా నిలవనుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో శబరిమల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రధాని నరేంద్రమోదీ అంగీకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులు భారీ సంఖ్యలో ఉంటారు. డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
