అయోధ్యలో(Ayodhya) నిర్మితమవుతున్న రామమందిరం(Ram Mandhir) ప్రారంభోత్సవానికి తరుణం ఆసన్నమవుతోంది. 2024, జనవరి 22న ప్రతిష్టాపన కార్యక్రమం బ్రహ్మండంగా జరగబోతున్నది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ద్వారా 50వేల కోట్ల రూపాయల వ్యాపారం(Business) జరగనుందట! ఈ విషయాన్ని సీఏఐటీ(CAIT) చెబుతోంది. మందిర ప్రారంభోత్సవానికి ప్రముఖలు, భక్తులు వస్తున్నారు కదా! కాబట్టి తప్పకుండా వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(Trade body Confederation of All India Traders) భావిస్తోంది. ఒక్క వ్యాపారులే కాదు, కళాకారులు(Artist) కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని చెబుతోంది.

Ayodhya Ram Mandir
అయోధ్యలో(Ayodhya) నిర్మితమవుతున్న రామమందిరం(Ram Mandhir) ప్రారంభోత్సవానికి తరుణం ఆసన్నమవుతోంది. 2024, జనవరి 22న ప్రతిష్టాపన కార్యక్రమం బ్రహ్మండంగా జరగబోతున్నది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ద్వారా 50వేల కోట్ల రూపాయల వ్యాపారం(Business) జరగనుందట! ఈ విషయాన్ని సీఏఐటీ(CAIT) చెబుతోంది. మందిర ప్రారంభోత్సవానికి ప్రముఖలు, భక్తులు వస్తున్నారు కదా! కాబట్టి తప్పకుండా వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(Trade body Confederation of All India Traders) భావిస్తోంది. ఒక్క వ్యాపారులే కాదు, కళాకారులు(Artist) కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని చెబుతోంది. దేశవ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి రామమందిర ప్రారంభత్సం వరకు ప్చారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వస్త్ర ఉత్పత్తులు, లాకెట్లు, కీ చైన్లు, రామ దర్బారు చిత్రాలు, రామ మందిర నమూనాలు, శ్రీరామ ధ్వజ, శ్రీరామ అంగవస్త్రం మొదలైనవి అందుబాటులో ఉంచారు. రామమందిర నమూనాలకు(samples) బాగా డిమాండ్ ఉంది. హార్డ్‌బోర్డు, పైన్‌వుడ్, కలప మొదలైన వాటితో భిన్నమైన సైజులలో ఈ నమూనాలను తయారు చేశారు. వీటి తయారీలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారని వాణిజయ సంఘం నాయకులు తెలిపారు. అయోధ్యకు వచ్చే భక్తులు ప్రత్యేక వస్త్రాలు ధరించడానికి ఆసక్తి చూపుతారు. అందుకే వారి కోసం కుర్తాలు, టీ- షర్టులను(T-shirts) అందుబాటులో ఉంచారు. వీటిపై శ్రీరామ మందిర నమూనాలు ముద్రించి ఉంటాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని పిలుపు ఇవ్వడంతో మట్టి దీపాలకు, రంగోలిలో ఉపయోగించే వివిధ రంగులకు, అలంకరణ పూలకు, ఎలక్ట్రికల్ దీపాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇవి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్‌లు, కరపత్రాలు, స్టిక్కర్లు కూడా తయారవుతున్నాయి. వీటన్నింటితో పాటుగా రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ భాషలలో ఆలయానికి సంబంధించిన పాటలు తయారవుతున్నాయి. వీటి వల్ల రచయితలు, కంపోజర్లు, గాయనీగాయకులు, వాయిద్యకారులు
