Russia Support India : లోక్‌సభ ఎన్నికల్లో తలదూర్చాలనుకున్న అమెరికా... రష్యా కామెంట్
అమెరికాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్తాన్ ఉగ్రవాది (Khalistani terrorist) గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)పై హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే! అయితే ఈ హత్యాయత్నంలో భారత గూఢచార సంస్థ రా(Raw) ప్రమేయం ఉందని అమెరికా ఆరోపించిన విషయం కూడా తెలిసిందే! అమెరికా చేసిన ఆరోపణలపై రష్యా(Russia) రియాక్టయ్యింది. భారత్‌కు మద్దతుగా నిలుస్తూ అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
అమెరికాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్తాన్ ఉగ్రవాది (Khalistani terrorist) గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)పై హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే! అయితే ఈ హత్యాయత్నంలో భారత గూఢచార సంస్థ రా(Raw) ప్రమేయం ఉందని అమెరికా ఆరోపించిన విషయం కూడా తెలిసిందే! అమెరికా చేసిన ఆరోపణలపై రష్యా(Russia) రియాక్టయ్యింది. భారత్‌కు మద్దతుగా నిలుస్తూ అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో భారత పౌరుల ప్రమేయం ఉందని అంటున్న అమెరికా ఇప్పటి వరకు నమ్మదగిన సాక్ష్యాలను అందించలేదని రష్యా తెలిపింది. ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం పన్నూన్‌పై హత్య కుట్ర వెనుక భారత ప్రమేయం గురించి అమెరికా నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదు. సాక్ష్యం లేనప్పుడు దీనిపై ఉహాగానాలు అమోదయోగ్యం కాదు' అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా అన్నారు. పనిలో పనిగా అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతదేశ లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Elections) జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై అమెరికాకు సరైన అవగాహన లేదని చెబుతూ మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. భారత్‌లోని అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేయడానికి, లోక్‌సభ ఎన్నికలను క్లిష్టతరం చేసేందుకు ప్రయత్నిస్తోందని మారియా జఖరోవా ఆరోపించారు.