ఒడ్డు-పొడుగు, శరీర దారుఢ్యం ఉన్న యువకులు పొరపాటున కూడా రష్యాకు(Russia) వెళ్లకండి. అలా రష్యాను చూసొచ్చేద్దాం అని వెళ్లారో అంతే సంగతులు! అక్కడి సైన్యంలో చచ్చినట్టు చేరాల్సి వస్తుంది. అదేమిటని అడక్కండి.. అదంతే! రష్యా సైన్యం బాధితుల చిట్టాలో బోల్డంత మంది భారతీయులున్నారు. లేటెస్ట్‌గా మరో ఏడుగురు తమను రష్యా చెర నుంచి కాపాడాలని విదేశాంగశాఖను వేడుకున్నారు.

ఒడ్డు-పొడుగు, శరీర దారుఢ్యం ఉన్న యువకులు పొరపాటున కూడా రష్యాకు(Russia) వెళ్లకండి. అలా రష్యాను చూసొచ్చేద్దాం అని వెళ్లారో అంతే సంగతులు! అక్కడి సైన్యంలో చచ్చినట్టు చేరాల్సి వస్తుంది. అదేమిటని అడక్కండి.. అదంతే! రష్యా సైన్యం బాధితుల చిట్టాలో బోల్డంత మంది భారతీయులున్నారు. లేటెస్ట్‌గా మరో ఏడుగురు తమను రష్యా చెర నుంచి కాపాడాలని విదేశాంగశాఖను వేడుకున్నారు. ఈమేరకు వారు ఉక్రెయిన్‌(Ukrain) సరిహద్దుల నుంచి వీడియో కూడా విడుదల చేశారు. వీరిలో అయిదుగురు పంజాబ్‌కు చెందిన వారు కాగా, ఇద్దరు హర్యానాకు చెందిన వారు. బాధితుల పేర్లు గగన్‌దీప్‌ సింగ్‌, లవ్‌ప్రీత్‌ సింగ్‌, నరైన్‌ సింగ్‌, గురుప్రీత్‌ సింగ్‌, హర్ష్‌కుమార్‌, అభిషేక్‌ కుమార్‌. వీరంతా పాతికేళ్లలోపు వయసున్న నవ యువకులు కావడం గమనార్హం. ఈ ఏడుగురిలో ఒకరు టూరిస్ట్ వీసాపై రష్యాకు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి సైన్యంలో హెల్పర్‌గా వెళ్లాలని బెదిరించారట! వెళ్లకపోతే పదేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారట! 'మొదట మమ్మల్ని హెల్పర్లుగా మాత్రమే పనిచేయాలన్నారు. కానీ, ఆ తర్వాత సాయుధ శిక్షణలో పేరు నమోదు చేశారు. మమ్మల్ని ఉక్రెయిన్‌లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు తిండి పెట్టడం లేదు. మా ఫోన్లు లాక్కొన్నారు’ అంటూ ఆ వీడియోలో పంజాబీ భాషలో తాము పడుతున్న యాతనను వివరించారు. ఏడాది తర్వాత మాత్రమే పంపిస్తామని చెప్పినట్లు మరో యువకుడు తెలిపాడు. అక్కడి నుంచి సజీవంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు మరో యువకుడు. ఇండియా నుంచి సుమారు వంద మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించారు! అక్కడ్నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారు. దీనిపై కేంద్రప్రభుత్వం రియాక్టయ్యింది. ఈ విషయంపై తాము రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ చెప్పారు. అక్కడ పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ అంశంపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

Updated On 6 March 2024 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story