మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి తొమ్మిది స్థానాలను గెలుచుకుంది.

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. మహారాష్ట్రలోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. మా తొమ్మిది మంది అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకం ఉందని శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. అద్భుతం జరిగింది.. మహాయుతి ఎమ్మెల్యేలు మాకు ఓటేయడమే కాకుండా ఇతర పార్టీల వారు కూడా మా అభివృద్ధి పనులను చూసి మద్దతిచ్చారని అన్నారు.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం అని సీఎం షిండే అసెంబ్లీలో అన్నారు. ప్రత్యర్థి వికెట్లు ఇలా పడిపోతూనే ఉంటాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో విజయ పరంపర ప్రారంభమైందని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది కొనసాగుతుంది. మా తొమ్మిది మంది అభ్యర్థులు గెలిచారు. మా ఓట్లే కాకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా మాపై విశ్వాసం వ్యక్తం చేశారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నాయకుడు అజిత్ పవార్ శాసన మండలి ఎన్నికల వ్యూహం గురించి వివరణాత్మక సమాచారాన్ని పంచుకున్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో మూడు సార్లు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ఆయా ఎమ్మెల్యేలకు ఎలా ఓటు వేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేయరని కూడా చర్చ జరిగింది. ఈ వ్యూహం వల్లే మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఈ వ్యూహంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అజిత్ అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story