ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్(Indhresh kumar) మాట మార్చేశారు. భారతీయ జనతాపార్టీపై పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో యూటర్న్ తీసుకున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్(Indhresh kumar) మాట మార్చేశారు. భారతీయ జనతాపార్టీపై(BJP) పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో యూటర్న్ తీసుకున్నారు. బీజేపీకి అహం పెరిగిందని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలిఆలు రాలేదని ఇంద్రేష్ కుమార్ అన్నారు. పేరు ప్రస్తావించకుండా ఇండియా బ్లాక్‌పై కూడా విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ప్లేటు ఫిరాయించారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయని, రాముడిని వ్యతిరేకించిన వారు అధికారంలో లేరని, రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవారే ప్రస్తుతం అధికారంలోకి వచ్చారని ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఇదే ఇంద్రేష్ గురువారం జైపూర్ కనోటాలో ఏమన్నారంటే, రాముడిని పూజించేవారిలో అహం పెరిగిపోయిందని, వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారని అన్నారు. 'చివరికి ఏం జరిగింది? వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు' అని వ్యాఖ్యానించారు. ఆయనే ఇండియా కూటమిని కూడా ఆడిపోసుకున్నారు.'ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా ఆ రాముడు 234 దగ్గరే నిలిపివేశాడు' అని చెప్పుకొచ్చారు. మొన్నామధ్య ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడని, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని పరోక్షంగా మోదీపై సెటైర్లు విసిరారు.