కదులుతున్న రైలులో కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాళ్లోకెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జవాన్ నలుగురు వ్యక్తులను కాల్చి చంపాడు.
కదులుతున్న రైలు(Train)లో కాల్పులు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వివరాళ్లోకెళితే.. మహారాష్ట్ర(Maharashtra)లోని పాల్ఘర్ రైల్వే స్టేషన్(Palghar Railway Station) సమీపంలో జైపూర్ ఎక్స్‌ప్రెస్(Jaipur Express) రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జవాన్(Jawan) నలుగురు వ్యక్తులను కాల్చి చంపాడు.
ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. జవాన్ తన ఆటోమేటిక్ వెపన్(Automatic Weapon) నుండి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరొక ఆర్పీఎఫ్ జవాన్(ఏఎస్సై), రైలులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు. రైలు జైపూర్ నుంచి ముంబై(Mumbai) వెళ్తోంది. పాల్ఘర్ స్టేషన్ ముంబై నుండి 100 కి.మీ దూరం ఉంటుంది.
ఆర్ఫీఎఫ్ ఏఎస్సై(RPF ASI), మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన తర్వాత.. నిందితుడు దహిసర్ స్టేషన్(Dahisar Station) సమీపంలో రైలు నుండి దూకాడు. నిందితుడుతో పాటు ఆయుధాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే(Western Railway) తెలిపింది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.