ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi liquor Case) అరెస్టయి తీహార్ జైలులో(Thihar Jail) ఉన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మధ్యంతర బెయిల్(Interim bail) పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) తిరస్కరించింది.

MLC Kavitha
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi liquor Case) అరెస్టయి తీహార్ జైలులో(Tihar Jail) ఉన్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మధ్యంతర బెయిల్(Interim bail) పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) తిరస్కరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి కావేరీ బవేజా.. తీర్పును రిజర్వు చేశారు. మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. 16న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా, 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. కస్టడీ ముగియడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. అయితే సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కవిత వ్యతిరేకించారు.
