ఓ ఏజ్ వచ్చాక తిండి మీద కంట్రోల్ ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు(Diabetic patients) డైట్ మీద కంట్రోల్ ఉండాలి. పాపం వారు ఆలుగడ్డ(Potato) కూడా తినకూడదు. బంగాళదుంపల్లో కొవ్వు(Fat) ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతారు. మరి బంగాళదుంపలంటే అమిత ఇష్టమున్నవాళ్లు ఏం చేయాలి? జిహ్వచాపల్యాన్ని ఎలా చంపుకోవాలి? అంటే ఇప్పుడా బెంగేమీ లేదంటున్నారు.
ఓ ఏజ్ వచ్చాక తిండి మీద కంట్రోల్ ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు(Diabetic patients) డైట్ మీద కంట్రోల్ ఉండాలి. పాపం వారు ఆలుగడ్డ(Potato) కూడా తినకూడదు. బంగాళదుంపల్లో కొవ్వు(Fat) ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతారు. మరి బంగాళదుంపలంటే అమిత ఇష్టమున్నవాళ్లు ఏం చేయాలి? జిహ్వచాపల్యాన్ని ఎలా చంపుకోవాలి? అంటే ఇప్పుడా బెంగేమీ లేదంటున్నారు. లేటెస్ట్‌గా నీలకంఠ ఆలూ(nilkanth potato) మార్కెట్‌లోకి వచ్చేసింది. ఈ రకాన్ని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన రోహ్తస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్(Rohtas Agriculture Science Centre) అభివృద్ధి చేసింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట! ఈ నీలకంఠ బంగాళదుంపలో అనేక మంచి గుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ రతన్ కుమార్ చెబుతున్నారు. ఇందులో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. కాకపోతే కాసింత ఖరీదు ఎక్కువ. అన్నట్టు నీలకంఠ ఆలూకు ఎలాంటి చీడపీడలు సోకవట! మార్కెట్ విలువ కూడా ఎక్కువగానే ఉంటుందట!