దీపావళి పండుగను(Diwali Festival) దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ అమావాస్య(amavasya) ఉంది కాబట్టి కొందరు ఈ రోజు కూడా దీపావళిని జరుపుకుంటున్నారు. ఆదివారం దేశం వెలుగులను విరజిమ్మింది.
దీపావళి పండుగను(Diwali Festival) దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ అమావాస్య(amavasya) ఉంది కాబట్టి కొందరు ఈ రోజు కూడా దీపావళిని జరుపుకుంటున్నారు. ఆదివారం దేశం వెలుగులను విరజిమ్మింది. చిన్నా పెద్ద, ధనిక పేద అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బాణాసంచా(Crackers) చప్పుళ్లు మారిమోగాయి. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఉత్తరాదిన దీపావళి రోజు లక్ష్మీ(Lakshmi) పూజ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి(Delhi) చెందిన ఓ రోబోటిక్ కంపెనీ(Robotic Company) దీపావళిని విచిత్రంగా జరిపింది. లక్ష్మీదేవికి రోబో చేతుల మీదుగా హారతులు(Harathi) ఇప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్లు మురిసిపోతున్నారు.