ఎన్నికల్లో(Elections) అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు, తండ్రి కొడుకులు, తల్లీ కొడుకులు పోటీపడటం చూశాం! ఇప్పుడు మొగుడు పెళ్లాలు ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఈ ఆసక్తికరమైన ఘటన రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవరగ్ంలో(Ramgarh Constituency) చోటు చేసుకుంది. అక్కడ భార్యాభర్తలిద్దరూ పరస్పరం పోటీ పడుతుండటంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆ నియోజకవర్గంపై పడింది.

Rita Chaudhary

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు వీరేంద్ర సింగ్(Veerendra singh). పీసీసీ(PCC) మాజీ అధ్యక్షుడు, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ్ సింగ్(Narayan Singh) కుమారుడే వీరేంద్ర సింగ్. ఈసారి కూడా రామ్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున వీరేంద్ర సింగే నిల్చోబోతున్నారు. గమ్మత్తైన విషయమేమిటంటే ఆయన భార్య రీటా చౌధరి(Rita Chaudhary) ఇప్పుడు అదే రామ్‌గఢ్ నుంచి బరిలో దిగబోతున్నారు.
2018లో ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. అప్పట్నుంచి ఆమె రాజకీయంగా ఎదగాలనే పంతాన్ని పెంచుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జననాయక్ జనతాపార్టీలో(Jananaik Janata Party) చేరారు. స్వల్పకాలంలోనే జేజేపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలయ్యారు. రామ్‌గఢ్‌లో తమ అభ్యర్థిగా రీటా చౌధరిని జేజేపీ ప్రకటించింది.
అంటే వీరేంద్ర సింగ్ కాంగ్రెస్ తరపున, రీటా జేజేపీ తరపున బరిలో దిగుతున్నారన్నమాట! అభివృద్ధి, నీటి సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలనే ఎన్నికల ప్రచారంలో తన అస్త్రాలుగా మల్చుకుంటానని రీటా అంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు బాగానే పని చేశారంటూ తన భర్తను పొగిడినట్టే పొగిడి..
కాకపోతే చేయాల్సిన పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ముక్తాయించారు. భర్తతో పోటీపై ఆమెను అడిగినప్పుడు కాంగ్రెస్‌లో ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాలేదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడబోనని చెప్పుకొచ్చారు. వీరేంద్ర సింగ్ మాత్రం ఈ ఎన్నికల్లో తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని పేర్కొన్నారు.