మహారాష్ట్రలోని(Maharastra) పుణెలో(Pune) దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి(Lover) చేతిలో ఓ యువతి హత్యకు(Murder) గురైంది. ఈ ఘటన పింప్రీ చించ్‌వాడలోని(Pimpri Chinchwad) హింజవాడిలో ఓయోటైన్ హౌజ్‌లో జరిగింది. పుణెకు చెందిన వందన ద్వివేది(vandana Dwivedi) అనే యువతి హింజావడిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన రిషబ్ నిగమ్‌తో(Rishab Nigam) వందన ద్వివేదికి ఉన్న పదేళ్ల పరిచయం చాన్నాళ్ల కిందట ప్రేమగా మారింది.

Pune Crime
మహారాష్ట్రలోని(Maharastra) పుణెలో(Pune) దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి(Lover) చేతిలో ఓ యువతి హత్యకు(Murder) గురైంది. ఈ ఘటన పింప్రీ చించ్‌వాడలోని(Pimpri Chinchwad) హింజవాడిలో ఓయోటైన్ హౌజ్‌లో జరిగింది. పుణెకు చెందిన వందన ద్వివేది(vandana Dwivedi) అనే యువతి హింజావడిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన రిషబ్ నిగమ్‌తో(Rishab Nigam) వందన ద్వివేదికి ఉన్న పదేళ్ల పరిచయం చాన్నాళ్ల కిందట ప్రేమగా మారింది. ఇటీవల వందనను కలుసుకోవడానికి రిషబ్ నిగమ్ పుణెకు వచ్చాడు. ఇద్దరూ కలిసి హింజవడిలో హోటల్ గది తీసుకున్నారు. జనవరి 25 నుంచి ఇద్దరూ హోటల్ గదిలోనే ఉంటున్నారు. శనివారం రాత్రి వందనను రిషబ్ తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత హోటల్ నుంచి పారిపోయాడు. ఆదివారం ఉదయం వందన మృతదేహాన్ని హోటల్ సిబ్బంది చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందనపై ఎప్పట్నుంచో అనుమానం పెట్టుకున్న రిషబ్ ఆమెను చంపేయడానికే పుణెకు వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వందనను కాల్చి చంపిన తర్వాత శనివారం రాత్రి పది గంటలకు రిషబ్ ఒక్కడే గది నుంచి బయటకు రావడం సీసీటీవీ ఫుటేజ్‌లో క్లియర్‌గా ఉంది. హత్య చేసిన తర్వాత రిషబ్ ముంబాయికి పారిపోయాడు. పోలీసులు అక్కడే అతడిని అదుపులోకి తీసుకున్నారు. రిషబ్‌కు గన్ ఎక్కడ్నుంచి వచ్చిందనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
