అతను ఓ కంపెనీకి సీఎఫ్‌వోగా(CFO) పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ కంపెనీకి తాను రాజీనామా(Resign) చేయాలనుకున్నాడు. జనరల్‌గా ఎలాంటి చిన్న కంపెనీలోనైనా ఎవరైనా ఉద్యోగి రాజీనామా చేస్తే సాఫ్ట్‌ కాపీ(Post Copy) ద్వారా లేదా లెటర్‌ టైప్‌ చేసి సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. చివరికి ఆఫీస్‌ బాయ్‌ కూడా ఇదే పద్ధతిని పాటించడం సర్వసాధారణం.

రింకూ పటేల్(Rinku Patel) అనే వ్యక్తి మిష్టి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(Mishti India PVT LTD) అనే కంపెనీకి చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. తన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఆ పదవికి రాజీనామా చేయాలనుకున్నాడు. దీనికి ఆయన సాఫ్ట్‌కాపీ కానీ, టైపింగ్‌ లెటర్‌ కానీ వాడలేదు. మన చిన్నప్పుడు స్కూళ్లో సెలవు పెడితే లీవ్‌ లెటర్ ఎలా రాస్తామో అదే పద్ధతిలో స్వయంగా తన చేతి రాతతో ఓ కాగితంపై రాజీనామా చేస్తున్నట్లు రాశాడు. తన సహోద్యోగులు, వాటాదారులను ఉద్దేశిస్తూ వారి హక్కులను కాపాడానని.. ఇన్ని రోజులు ఈ అవకాశం ఇచ్చినందుకు కంపెనీకి ధన్యవాదాలు అంటూ లేఖ రాశారు. కంపెనీలో తనకున్న అనుభవాలు, అవకాశాలు, అనుభూతులు పొందుపరుస్తూ తన హ్యాండ్‌ రైటింగ్‌తో లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది.

దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఈ లేఖ నిస్సందేహంగా కంపెనీ చరిత్రలో నిలిచిపోతుందని.. కంపెనీలో ప్రత్యేకంగా ఉండిపోనుందని రాశాడు. మరొకరు.. మీ వ్యక్తిగత కారణాలవల్లే రాజీనామా అంటున్నారు.. అంటే.. మీరు సమయం ఇవ్వడంలేదని.. ఇలాంటి లేఖనే మీ పిల్లలు మీకు రాసి ఉంటారని.. దీంతో మీరు కూడా స్వయంగా లేఖరాసి ఉంటారన్నారు. ఇప్పటికైనా మీ పిల్లలకు సమయం ఇస్తే బాగుంటుందని కామెంట్ చేశాడు.

Updated On 23 Dec 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story