2024 సార్వత్రిక ఎన్నికలకి అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. యూపీఏ I. N. D. I. A గా రూపాంతరం చెందింది. ఇప్పటికే ఈ కూటమి పలు సమావేశాలు నిర్వహించింది. అటు NDA కూడా సమావేశం నిర్వచించుకుని పలు అంశాలపై చర్చించుకున్నారు. అయితే NDA తరపున ప్రధాని అభ్యర్థి మోడీ దాదాపుగా ఖరారు. I. N. D. I. A కూటమి ప్రధాని అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కానప్పటికీ రాహుల్ గాంధీని ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2024 సార్వత్రిక ఎన్నికలకి అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. యూపీఏ I. N. D. I. A గా రూపాంతరం చెందింది. ఇప్పటికే ఈ కూటమి పలు సమావేశాలు నిర్వహించింది. అటు NDA కూడా సమావేశం నిర్వచించుకుని పలు అంశాలపై చర్చించుకున్నారు. అయితే NDA తరపున ప్రధాని అభ్యర్థి మోడీ దాదాపుగా ఖరారు. I. N. D. I. A కూటమి ప్రధాని అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కానప్పటికీ రాహుల్ గాంధీని ప్రాజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పోటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యే ఎక్కువగా జరుగుతోంది. ఇదే అంశం పై దేశానికి కాబోయే ప్ర‌ధాన మంత్రి గురించి ఏబీసీ న్యూస్(ABC News) సీ ఓటర్ సర్వే(C Voter Survey) నిర్వహించింది. ప్రజల దగ్గరి నుంచి చాలా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి

నరేంద్ర మోదీ(Narendra Modi), రాహుల్‌గాంధీ(Rahul Gandhi) మధ్య ప్రధానిని(Prime Minister) ఎన్నుకోవాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేసుకుంటారని ప్రశ్నించగా.. 71 శాతం మంది నరేంద్రమోదీని ఎన్నుకున్నారు. రాహుల్ గాంధీకి కేవలం 24 శాతం మాత్రమే ఓట్లు రావడం గమనార్హం. వీరిద్దరు కాదని 4 శాతం మంది అభిప్రాయపడగా.. ఇద్దరిలో ఎవరవుతారో తెలియదని ఒక శాతం చెప్పారు.

మోదీ, రాహుల్ మధ్య ప్రత్యక్ష ప్రధానిని ఎంచుకోవాలనుకుంటే, మీరు ఎవరిని ఎన్నుకుంటారు?
నరేంద్ర మోదీ-71%
రాహుల్ గాంధీ – 24%
రెండూ కాదు – 4%
తెలియదు – 1%

ఈ సర్వే ని కేవలం మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) రాష్ట్రాల్లో మాత్రమే నిర్వహించారు. ఆ రాష్ట్రాల్లోని ప్రజల అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నారు. వాస్తవానికి ఈ సర్వే ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపై కూడా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపనుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసి రాజకీయ వేడిని పెంచింది. అటువంటి వాతావరణంలో తాజా సర్వే నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Updated On 21 Aug 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story