అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram mandir) గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. 500 ఏళ్ల నాటి కల సాకారమైంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత ఆ రాముడిని కనులారా చూసేందుకు రామభక్తులు ఎదురుచూస్తున్నారు. ఈరోజుల్లో రవాణా వ్యవస్థ(Transportation) మెరుగుపడడంతో ప్రజలు సులభంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఏడాదికోసారో రెండో సార్లో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.

అయోధ్య(Ayodhya) రామమందిరం(Ram mandir) గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. 500 ఏళ్ల నాటి కల సాకారమైంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత ఆ రాముడిని కనులారా చూసేందుకు రామభక్తులు ఎదురుచూస్తున్నారు. ఈరోజుల్లో రవాణా వ్యవస్థ(Transportation) మెరుగుపడడంతో ప్రజలు సులభంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఏడాదికోసారో రెండో సార్లో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో ఉత్తరప్రదేశ్‌(UttarPradesh) రూపురేఖలు మారుతాయంటున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక టూరిజంలో ఇది సింహభాగం వహించనుందని అంటున్నారు.

ఈ టూరిజం వల్ల రవాణారంగం, హోటళ్లు(Hotel).. రెస్టారెంట్లతో(Restaurants) ఇతర వ్యాపారాలకు(Business) గిరాకీ ఉంటుంది. సంవత్సరంలో 2 నెలలు ఉండే శబరిమల అయ్యప్ప సీజన్ కారణంగా అయ్యప్ప ఆలయానికి వచ్చే ఆదాయం రూ.357 కోట్లు. లక్షల్లో తరలి వచ్చే భక్తుల కారణంగా రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం మరెంత ఉంటుందో అంచనా వేసుకోవాలి. అయోధ్యలో రామమందిరం ప్రారంభించిన తర్వాత ఆధ్యాత్మికంగా పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్(SBI Research) అంచనా వేసింది. రాష్ట్ర పర్యాటక ఆదాయం రూ.10,500 కోట్లు. 2024-25లో యూపీ సర్కారుకు అదనంగా రూ.25వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. భారీగా తరలి వచ్చే యాత్రికుల కారణంగా ఆదాయం కూడా అంతే మొత్తంగా పెరగనుందని చెప్తున్నారు. రోడ్డు, రవాణా రంగాలు అభివృద్ది చెందుతాయని నివేదిక తెలిపింది. 2022లో ఉత్తరప్రదేశ్‌కు 32 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఇందులో అయోధ్యకు వచ్చిన యాత్రికుల సంఖ్య కేవలం 2.21 కోట్ల మంది. విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకోవడంలో యూపీ ఇప్పటికే ఐదో స్థానంలో ఉంది. అంతేకాదు దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 10 శాతం కావటం గమనార్హం. 2027-28 నాటికి దేశ జీడీపీలో ఉత్తరప్రదేశ్‌కు రెండో స్థానం సాధిస్తుందని చెప్తున్నారు. అయోధ్యలో పర్యాటకుల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రామ మందిరం నుంచి 5-10కి.మీ. దూరంలో గజం దాదాపు రూ.2 లక్షల వరకు పలుకుతోంది.

Updated On 22 Jan 2024 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story