ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi) సిల్‌క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు మరికొద్ది గంటల్లో బయటకు రానున్నారు. గత 16 రోజులుగా ప్రాణాలను అరచేత పట్టుకుని క్షణమొక యుగంలా బతికిన కూలీలకు నిజంగా ఇది పునర్జన్మే! కార్మికులను కాపాడేందుకు చేపట్టి సహాయక చర్యలు కొలిక్కి వచ్చాయి.

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తర్‌కాశీ (Uttarkashi) సిల్‌క్యారా సొరంగం (Silkyara tunnel)లో చిక్కుకుపోయిన 41 మంది కూలీలు మరికొద్ది గంటల్లో బయటకు రానున్నారు. గత 16 రోజులుగా ప్రాణాలను అరచేత పట్టుకుని క్షణమొక యుగంలా బతికిన కూలీలకు నిజంగా ఇది పునర్జన్మే! కార్మికులను కాపాడేందుకు చేపట్టి సహాయక చర్యలు కొలిక్కి వచ్చాయి. నేలకు సమాంతరంగా మొదట చేపట్టిన పనులు ఆగిపోయిన చోట 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్లు (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) చాలా వేగంగా తవ్వకాలు చేస్తున్నారు. ఏ క్షణమైనా బాధితులను బయటకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే కూలీల (Workers) కుటుంబాలకు కూడా ఈ శుభవార్త చెప్పారు. సాయంత్రం అయిదు గంటలలోపు కార్మికులు వెలుపలికి రావచ్చు. తాజా పరిస్థితులపై కూలీల కుటుంబాలకు ఇప్పటికే అధికారులు సమాచారమిచ్చారు. వారి దుస్తులు, బ్యాగులతో సిద్ధంగా ఉండండి అని కుటుంబ సభ్యులకు తెలిపారు. సొరంగం నుంచి కూలీలను బయటకు తీసుకు రావడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటికే మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే వైద్య చికిత్స అందించనున్నారు. మరోవైపు కూలీలను తరలించేందుకు సొరంగం వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలుగా రోడ్లను మెరుగుపర్చారు.

Updated On 28 Nov 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story