Hindu Phobia : అమెరికాలో పెరుగుతోన్న హిందూ ఫోబియా...
తమ దేశంలో హిందువులకు(Hindus) వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నట్టు అమెరికాకు చెందిన చట్టసభ ప్రతినిధి థానేదార్(Thanedar) అంగీకరించారు. హిందూ ఫోబియాకు(Hindu Phobia) వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అమెరికాలో ద్వేషానికి తావు లేదని థానేదార్ అన్నారు. క్యాపిటల్ హిల్‌లో(Capita hill) కొన్ని హిందూ గ్రూపులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న థానేదార్ ఈ మాటలన్నారు.
తమ దేశంలో హిందువులకు(Hindus) వ్యతిరేకంగా దాడులు పెరుగుతున్నట్టు అమెరికాకు చెందిన చట్టసభ ప్రతినిధి థానేదార్(Thanedar) అంగీకరించారు. హిందూ ఫోబియాకు(Hindu Phobia) వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అమెరికాలో ద్వేషానికి తావు లేదని థానేదార్ అన్నారు. క్యాపిటల్ హిల్‌లో(Capita hill) కొన్ని హిందూ గ్రూపులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న థానేదార్ ఈ మాటలన్నారు. హిందువుల పట్ల జరుగుతున్న విద్వేష నేరాలను అడ్డుకోవాలని పిలుపిచ్చారు. రానురాను ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయని, హిందువులను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందుకే హిందూ కాకస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు థానేదార్ తెలిపారు. అమెరికా కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి హిందూ కాకస్ ఏర్పడిందని, మతస్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతో ఆ కాకస్‌ను ఏర్పాటు చేసినట్లు థానేదార్ తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్‌లలో, కాలేజీలలో హిందూ వ్యతిరేక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని హిందూ అమెరికన్ ఫౌండేషన్ నేత సుహాగ్ శుక్లా అన్నారు. గత రెండేళ్లలో హిందూ వ్యతిరేక దాడుల సంఖ్య పెరిగిందని ఆమె తెలిపారు.