దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీ అనే ఉంటుంది? అంటూ కామెంట్ చేసిన కేసులో కాంగ్రెస్ నేత, వాయనాడు ఎంపీ రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే కదా! అందుకు ప్రతిగా కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) ప్రధాని మోదీపై పరువునష్టం కేసు వేయానికి సిద్ధమయ్యారు.
దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీ(Modi) అనే ఉంటుంది? అంటూ కామెంట్ చేసిన కేసులో కాంగ్రెస్ నేత, వాయనాడు ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandi)కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే కదా! అందుకు ప్రతిగా కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) ప్రధాని మోదీ(PM Modi)పై పరువునష్టం కేసు వేయానికి సిద్ధమయ్యారు. 2018లో పార్లమెంట్‌లో తన నవ్వును శూర్పణఖ (Surpanakha) నవ్వుతో పోల్చారని, సభలో అందరి ముందు తనను అవమానిస్తూ మోదీ మాట్లాడిన మాటలు తనను అమితంగా బాధించాయని, అందుకు ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు రేణుకా చౌదరి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (twitter)ద్వారా స్పష్టం చేశారు. తాను ప్రధాని నరేంద్ర మోదీపై దావా వేయబోతున్నానని, ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పని చేస్తాయో చూద్దాం అంటూ సెటైర్ విసిరారు!
నరేంద్రమోదీ పార్లమెంట్‌లో ప్రసంగించిన వీడియోను కూడా రేణుక ట్వీట్ చేశారు. రామాయణం (ramayanam) సీరియల్ ప్రసారం అయిన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరి నవ్వును కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్రమోదీ రాజ్యసభ చైర్మన్‌ను కోరినట్టు ఆ వీడియోలో ఉంది.
2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో (kolar) లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ (rahul)ప్రసంగిస్తూ మోదీపై విమర్శలు గుప్పించారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీరందరూ మోదీని ఒక ఉమ్మడి ఇంటిపేరుగా ఎలా కలిగి ఉన్నారు? దొంగలందరికీ మోదీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది?’’ అని రాహుల్ ప్రశ్నించారు. దీనికి బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష వేసింది.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడినందుకు క్షమాపణలు చెప్పకూడదని నిజం మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పకూడదని ఎంచుకున్నారు అని కోర్టు తీర్పు తర్వాత రేణుకా చౌదరి ట్వీట్ చేశారు.