మల్టీ టాలెంటెడ్ కావడంతో... అతను ఎక్కడున్నా ఏదో తెలియని ఆనందం చుట్టుపక్కల వారికి కలిగేది. అలాంటి ఎవిన్.. 26 ఏళ్ల వయసులో సడెన్‌గా ఈ లోకాన్ని వీడి.. ..తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. 2021 డిసెంబర్ 22న షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతూ సడెన్‌గా కుప్పకూలాడు. ప్రాణాలు విడిచాడు. అతని కుటుంబ సభ్యులకు కన్నీటి జ్ఞాపకాల్ని మిగిల్చి మాయమయ్యాడు.

కొన్ని జ్ఞాపకాలు సంతోషాన్ని ఇస్తే ...మరికొన్ని బాధను పంచుతాయి. ఎవరైన వ్యక్తి చనిపోయినప్పుడు వారికి సంభందించిన జ్ఞాపకాలు ఆ కుటుంభ సభ్యులను , స్నేహితులను , వెంటాడుతూనే ఉంటాయి.. అయితే కొన్ని ఏళ్లు గడిచాకా ... వారికి సంభందించిన ఆ జ్ఞాపకాలు కొంత వరకు మరుగున పడతాయి ..అయితే ఇక్కడ మాత్రం లోకాన్ని విడిచిపోయిన ఆ యువకుడి లోటును మర్చిపోలేని ఓ కుటుంబం అతడి జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచేందుకు ఓ ప్రయత్నం చేసింది.. అదే ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తూ చర్చనీయాంశం అయ్యింది. మనస్సును కదిలించే ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అతని పేరు ఎవిన్ ఫ్రాన్సిస్ . కేరళలోని త్రిచూర్ నివాసి. రకరకాల టాలెంట్స్ అతని సొంతం. చదువులోనే కాదు.. ఫొటోగ్రఫీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, డీకోడింగ్ ఇలా అతనికి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అంతేకాదు.. డ్రమ్స్, గిటార్, కీబోర్ట్ ప్లే చెయ్యగలడు . మల్టీ టాలెంటెడ్ కావడంతో... అతను ఎక్కడున్నా ఏదో తెలియని ఆనందం చుట్టుపక్కల వారికి కలిగేది. అలాంటి ఎవిన్.. 26 ఏళ్ల వయసులో సడెన్‌గా ఈ లోకాన్ని వీడి.. ..తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. 2021 డిసెంబర్ 22న షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతూ సడెన్‌గా కుప్పకూలాడు. ప్రాణాలు విడిచాడు. అతని కుటుంబ సభ్యులకు కన్నీటి జ్ఞాపకాల్ని మిగిల్చి మాయమయ్యాడు. దాంతో.. ఆ ఫ్యామిలీ.. కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.

త్రిచూర్‌లోని వట్టాకుజీకి చెందిన ఫ్రాన్సిస్ కొడుకు ఎవిన్ .... కొడుకు దూరమవ్వడంతో తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు , బంధువులకు ఓ ఐడియా వచ్చింది. ఎవిన్ జ్ఞాపకాలను డిజిటల్ రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఎవిన్ సమాధిపై ఓ QR కోడ్‌ను సెట్ చేశారు. QR కోడ్ స్కాన్ చేశాక కనిపించే వీడియోలు, ఫొటోల కోసం.. ఎవ్లిన్.. ఓ వెబ్‌సైట్ క్రియేట్ చేసింది. అందులో ఎవిన్ జీవితంలోని కీలక అంశాలు, అతని టాలెంట్‌కి సంబంధించిన వీడియోలను ఉంచింది. ఇప్పుడు ఎవరైనా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. వెంటనే మొబైల్‌లో ఎవిన్ కనిపిస్తాడు. అతని పాటలు, వీడియోస్ సందడి చేస్తాయి. ఎవిన్ సోదరి అయిన ఎవ్లిన్.. ఒమన్‌లో ఆర్కిటెక్ట్. ఆమెనే ఈ QR కోడ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సమాధిపై QR కోడ్ సెట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో అతను లేని లోటును మర్చిపోలేకపోతున్న ఆ కుటుంబ సభ్యులు.. అదే టెక్నాలజీతో అతని జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated On 20 March 2023 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story