టెలికాం రంగంలో రిలయన్స్ జియో(Reliance Jio) ఒక సంచలనం. ఫ్రీ ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్..ఆ తర్వాత ఎన్నో అన్‌లిమిటెడ్ ఆఫర్లతో ప్లాన్స్ తీసుకొచ్చింది. తాజాగా జియో కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. డేటా-ఇంటెన్సివ్ యాక్టివిటీస్‌లో భాగంగా కస్టమర్స్ కోసం రిలయన్స్ జియో కేవలం రూ. 219తోనే ఓ సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను(Pre Paid Recharge Plan) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అధిక డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఇంటర్నెట్ ను అధికంగా వినియోగించేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Reliance Jio New Offers

ప్రముఖ టెలికాం సంస్థలో రిలయన్స్ జియో ఒకటి. దేశంలో 44 కోట్లకుపైగా యూజర్లను కలిగి ఉంది. తన విస్తృతమైన కస్టమర్ కమ్యూనిటీ వాల్యూను అందించడంలో కంపెనీ నిబద్ధత, ఆకర్షణీయమైన ఆఫర్‌లతో కూడిన కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను జియో అనౌన్స్ చేస్తూ వస్తోంది. తాజాగా కస్టమర్స్ సౌలభ్యం కోసం జియో తన రీఛార్జ్ ప్లాన్‌లను మరింత విస్తృతపరిచింది. రూ. 219 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ను 14 రోజులపాటు అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్‌ను పొందే వీలు ఉంటుంది. దీంతోపాటు 100 కాంప్లిమెంటరీ SMSలను కూడా అదనంగా పొందే అవకాశం చందాదారులకు కల్పించింది. ఈ ప్లాన్ వినియోగదారులకు 14 రోజులకు పైగా 42GB డేటాను అందిస్తుంది. ప్రతిరోజూ 3GB ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా.. ఈ ప్లాన్‌లో ప్రత్యేకమైన 2GB ఉచిత డేటా ఉంది. దీని విలువ కేవలం రూ. 25 మాత్రమే. ఇది మొత్తం డేటా ఆఫర్‌ను 44జీబీకి పెంచుతుంది. అలాగే రూ. 219 ప్లాన్‌కు సబ్‌స్క్రైబర్‌లు జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమాలకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందుకుంటారు. జియో సినిమాకి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను చేర్చడం వల్ల కష్టమర్లు విభిన్నమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, టీవీ షోలకు యాక్సెస్ పొందగలుతారు.