రిలయన్స్ జియో(Reliance Jio) 'జియోమోటివ్'(Jio Motive) పేరుతో భారతీయ మార్కెట్లో ఓ సరికొత్త డివైజ్ లాంచ్ చేసింది. కేవలం రూ.4,999 వద్ద లభించే ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ కారులోని సమస్యలను ఇట్టే పసిగట్టేస్తుంది. జియోమోటివ్ అనేది ప్లగ్​ అండ్​ ప్లే 'ఓబీడీ' గ్యాడ్జెట్(OBD Gadjet). ఏ కారునైనా స్మార్ట్‌గా మార్చే ఈ డివైజ్..

రిలయన్స్ జియో(Reliance Jio) 'జియోమోటివ్'(Jio Motive) పేరుతో భారతీయ మార్కెట్లో ఓ సరికొత్త డివైజ్ లాంచ్ చేసింది. కేవలం రూ.4,999 వద్ద లభించే ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ కారులోని సమస్యలను ఇట్టే పసిగట్టేస్తుంది. జియోమోటివ్ అనేది ప్లగ్​ అండ్​ ప్లే 'ఓబీడీ' గ్యాడ్జెట్(OBD Gadjet). ఏ కారునైనా స్మార్ట్‌గా మార్చే ఈ డివైజ్.. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ తో పాటు కారులోని సమస్యలను కూడా ముందుగానే తెలియజేస్తుంది. దీంతో వినియోగదారుడు వాటిని పరిష్కరించుకోవచ్చు, తద్వారా మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ రిలయన్స్ డిజిటల్(Reliance digitals), జియో.కామ్(Jio.com), అమెజాన్(Amazon) వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.
జియోమోటివ్‌ ఫీచర్స్ ఎంటో తెలుసుకుందాం. రియల్ టైమ్ ట్రాకింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ కారులో ఫిక్స్ చేస్తే.. వాహనాన్ని 24 గంటలు పర్యవేక్షించవచ్చు. ఇది దొంగతనాలకు చెక్ పెడుతుంది.
జియో-ఫెన్సింగ్: ఈ ఫీచర్ ద్వారా మ్యాప్‌లో వర్చువల్ సరిహద్దులను(బౌండరీస్) సెట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
వెహికల్ హెల్త్ మానిటరింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ ద్వారా 100 కంటే ఎక్కువ డీటీసీ అలర్ట్ పొందవచ్చు. తద్వారా సమస్య పెద్దదికాకముందే పసిగట్టి పరిష్కరించుకోవచ్చు.
డ్రైవింగ్ అనలిటిక్స్: డ్రైవర్​ డ్రైవింగ్​ బిహేవియర్​ని కూడా ఈ గ్యాడ్జెట్ ఎనలైజ్​ చేస్తుంది. ఫ్యూయెల్​ ఎఫీషియెన్సీ, హార్ష్​ డ్రైవింగ్​- బ్రేకింగ్​, హార్ష్​ యాక్సలరేషన్​ వంటి అంశాలపై అలర్ట్​ పొందే అవకాశం ఉంటుంది.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి జియోథింగ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
జియో నెంబర్ ద్వారా లాగిన అయిన తరువాత ప్లస్‌ సింబల్‌పై క్లిక్ చేసి జియోమోటివ్ ఎంచుకుని, ఐఎమ్ఈఐ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.కారు రిజిస్ట్రేషన్ నెంబర్, కారు పేరు (బ్రాండ్ నేమ్), మోడల్, ఫ్యూయెల్ టైప్ వంటి మీ కారు వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఓబీడీ పోర్ట్‌కి జియోమోటివ్ గ్యాడ్జెట్ ప్లగ్ చేసి.. తరువాత దశలను కంప్లీట్ చేయాలి.
జియో ఎవిరీవేర్‌ కనెక్ట్‌ నెంబర్ షేరింగ్ ప్లాన్ రూల్స్ అంగీకరిస్తున్నట్లు టిక్ చేసి, ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత జీయో సీఆర్‌1440 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వగానే మీకు జియో నుంచి యాక్టివేట్ అభ్యర్థనకు ఓకే మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివేట్ కావడానికి 10 నిముషాలు కారును ఆన్‌లోనే ఉంచాలి.

Updated On 6 Nov 2023 11:58 PM GMT
Ehatv

Ehatv

Next Story