మూడో ఫ్రంట్‌ కోసం ఉబలాటపడిన ప్రాంతీయపార్టీలు ఈ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాయి. ఉంటే ఎన్‌డిఎలోనైనా ఉండాలి. లేకపోతే ఇండియా కూటమిలోనైనా ఉండాలనే జ్ఞానం ఆ పార్టీలకు వచ్చింది. అటు ఎన్డీయేతో(NDA) వెళ్లకుండా, ఇటు ఇండియా(INDIA) కూటమితో వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసిన ప్రాంతీయపార్టీలకు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కూడా లభించలేదు. ఆయా రాష్ట్రాల గొంతులు లోక్‌సభలో వినిపించకుండా పోయింది.

మూడో ఫ్రంట్‌ కోసం ఉబలాటపడిన ప్రాంతీయపార్టీలు ఈ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాయి. ఉంటే ఎన్‌డిఎలోనైనా ఉండాలి. లేకపోతే ఇండియా కూటమిలోనైనా ఉండాలనే జ్ఞానం ఆ పార్టీలకు వచ్చింది. అటు ఎన్డీయేతో(NDA) వెళ్లకుండా, ఇటు ఇండియా(INDIA) కూటమితో వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేసిన ప్రాంతీయపార్టీలకు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కూడా లభించలేదు. ఆయా రాష్ట్రాల గొంతులు లోక్‌సభలో వినిపించకుండా పోయింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో(Elections) బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి పోటీపడ్డాయి. ఈ ఎన్నికల్లో ఈ రెండు కూటములకు సమదూరం పాటిస్తూ ఒంటరిగా పోటీ చేశాయి కొన్ని పార్టీలు. బిజూ జనతాదళ్‌ (BJD), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP), భారతీయ రాష్ట్ర సమితి (BRS), అన్నా డీఎంకే (AIDMK)లను ప్రధానంగా చెప్పుకోవాలి. పాపం ఈ పార్టీలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ సున్నా చుట్టాయి. 18వ లోక్‌సభకు దేశవ్యాప్తంగా 52 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీలతో పాటుగా మిగిలిన జాతీయ పార్టీలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పొందిన పార్టీలు మాత్రమే లోక్‌సభకు వెళ్లగలిగాయి. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలలో గతంలో ప్రభుత్వాలను నడిపిన పార్టీలు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యానికి నోచుకోలేకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా 488 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీచేసిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం కూడా గెల్చుకోలేకపోయింది. గత లోక్‌సభలో బీఎస్పీకి పది మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉండేది. రెండు దశాబ్దాల పాటు ఒడిశాలో అధికారాన్ని చెలాయిస్తూ వచ్చిన నవీన్‌ పట్నాయక్‌కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌కు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా పోయింది. గత లోక్‌సభలో ఇదే బీజేడీకి 12 మంది ఎంపీలు ఉన్నారు తమిళనాడులో గతంలో అధికారంలో ఉన్న ఏఐడీఏంకే, తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్‌ సహా అనేక పార్టీలకు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం చేజారడం గమనార్హం. గత లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు తొమ్మిది మంది ఎంపీలు ఉండేవారు. ఇదిలా ఉంచితే ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ దాదాపు 11 రాష్ట్రాలలో ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్ము-కశ్మీర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ము-కశ్మీర్‌, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెల్చుకోలేకపోయింది.

Updated On 6 Jun 2024 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story