ఢిల్లీలో(Delhi) తన పని తీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు ఓ బాలుడు. పదేళ్ల వయసులో క్షయవ్యాధితో తండ్రిని కోల్పోయిన బాలుడు అటు చదువు, ఇటు కుటుంబ పోషణ కోసం తన తండ్రి ద్వారా నేర్చుకున్న ఆహారా పదర్థాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. తల్లి పంజాబ్‌కు వెళ్లి పోవడంతో తన 14 ఏళ్ల సోదరితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు జస్‌ప్రీత్‌(Jasprit) అనే బాలుడు.

ఢిల్లీలో(Delhi) తన పని తీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు ఓ బాలుడు. పదేళ్ల వయసులో క్షయవ్యాధితో తండ్రిని కోల్పోయిన బాలుడు అటు చదువు, ఇటు కుటుంబ పోషణ కోసం తన తండ్రి ద్వారా నేర్చుకున్న ఆహారా పదర్థాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. తల్లి పంజాబ్‌కు వెళ్లి పోవడంతో తన 14 ఏళ్ల సోదరితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నాడు జస్‌ప్రీత్‌(Jasprit) అనే బాలుడు. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో చికెన్ రోల్‌(chicken roll), ఎగ్ రోల్(Egg roll) తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. తన కుటుంబంలో నెలకొన్న విషాదాన్ని దాచుకొని మొహం మీద చిరునవ్వుతో వీటిని జస్‌ప్రీత్‌ విక్రయిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రెయిన్ ట్యూబర్‌ క్యులోసిస్‌తో ఇటీవల తన తండ్రిని కోల్పోయిన జస్‌ప్రీత్ తన తండ్రి ఉండే వీధిలో దుకాణం నడిపే బాధ్యతను తీసుకున్నాడు. అతనికి 14 ఏళ్ల అక్క ఉంది. తల్లి పంజాబ్ వెళ్లిన తర్వాత తాను మరియు అతని సోదరి ఢిల్లీలో తమ మామతో నివసించినట్లు ఆ యువకుడు చెప్పాడు.

రోల్స్ చేయడం తన తండ్రి దగ్గరే నేర్చుకున్నానని జస్‌ప్రీత్‌. బాయ్స్ స్టాల్‌లో చికెన్ రోల్, కబాబ్ రోల్, పనీర్ రోల్, చౌమీన్ రోల్, సీక్ కబాబ్ రోల్ వంటి వివిధ రకాల ఫుడ్‌ను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇన్ని కష్టాలు ఉన్నా ఈ ధైర్యం, దృఢ నిశ్చయం ఎలా వచ్చిందని పలువురు నెటిజన్లు జస్‌ప్రీత్‌ను అడగ్గా పంజాబీలో ఆ బాలుడు గంభీరంగా సమాధానం ఇచ్చాడు. పంజాబీలో 'నేను గురుగోవింద్ సింగ్ జీ కుమారుడిని.. నాకు బలం ఉన్నంత వరకు పోరాడతాను' అని జస్ప్రీత్ చెప్పాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో లక్షల మంది జస్‌ప్రీత్‌ను వేనోళ్ల కొనియాడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో(Social media) యాక్టివ్‌గా ఉండే మహీంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర(anand Mahindra) కూడా బాలుడి వీడియో చూసి చలించిపోయారు. జస్‌ప్రీత్‌ వివరాలు తనకు అందిస్తే బాలుడి చదువుకయ్యే ఖర్చును మహీంద్రా గ్రూప్‌ భరిస్తుందని ట్వీట్‌ చేశారు.

Updated On 6 May 2024 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story