కేరళలోని(Kerala) కోజికోడ్‌లో(Kojikod) నవంబర్‌ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మలయాళ మనోరమ సంస్థ ఏర్పాటు చేసిన మనోరమ హార్టస్‌ సాహితీ సమ్మేళనంలో నేను ప్రసంగించాల్సి ఉండింది.

కేరళలోని(Kerala) కోజికోడ్‌లో(Kojikod) నవంబర్‌ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మలయాళ మనోరమ సంస్థ ఏర్పాటు చేసిన మనోరమ హార్టస్‌ సాహితీ సమ్మేళనంలో నేను ప్రసంగించాల్సి ఉండింది. నిర్వాహకులైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌(Retaired IAS Officers) ఎన్‌.ఎస్‌.మాధవన్‌ ఫోన్‌ చేసి ప్రసంగం రద్దయ్యిందని చెప్పారు. అందుకు కారణం అక్టోబర్‌ 23వ తేదీన సాక్షి దిన పత్రికలో(Sakshi news paper) ఇజ్రాయెల్‌(Israel)-పాలస్తీనా(Palastine) అంశంపై రాసిన ఓ వ్యాసమని అన్నారు. రెండు దేశాలుగా బతకమే దారి అనే శీర్షికతో వచ్చిన ఆ వ్యాసంలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు పాలస్తీనా అనుకూల నిరసనకారరులకు కోపం తెప్పించాయట! అప్పటికీ నా విమాన టికెట్ కూడా బుక్‌ అయ్యింది. నేను అక్కడికి వెళ్లి ప్రసంగిస్తే గొడవలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పారు. నిరసనకారులు ఆందోళనలు చేయవచ్చని, హింసకు దారి తీసినా తీయవచ్చని వారు భయపడ్డారు. ప్రసంగం నేపథ్యంలో పాలస్తీనా అనుకూలురు పెద్ద ఎత్తున నిరసనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, అది అశాంతియుత ప్రదర్శన కూడా కావచ్చునని నిర్వాహకులు ఫోన్‌ చేసి చెప్పారు. కేరళలో ఉన్న సీపీఎం ప్రభుత్వం కానీ, మలయాళ మనోరమ సంస్థ వారు కానీ జాతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు వ్యక్తం చేసేవారిని బెదిరించకూడదని, ఆహ్వానాలు రద్దు చేయకూడదని చెప్పలేదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదే! నా వాక్‌ స్వాతంత్య్రాన్ని అడ్డుకునే అలాంటి చర్యలను సభాముఖంగా ఖండించాలని నేను నిర్వాహకులను కోరాను. దానికి కూడా వారు స్పందించలేదు.

ఇలాంటి ఘటన మన దగ్గర కూడా జరిగింది. నవంబర్‌ 11వ తేదీన వేములవాడలో గ్రంథాలయ ప్రారంభోత్సవం సందర్భంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. అక్టోబర్‌ 31వ తేదీన మార్క్సిస్ట్‌ లెనినిస్ట్ గ్రూప్‌ (రాజన్న గ్రూపు) కు చెందిన గాయని విమలక్క నాకు ఫోన్‌ చేసి లైబ్రరీ బిల్డింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరారు. పాతికేళ్ల కిందట పోలీసులు అత్యంత క్రూరంగా చంపిన రంగవల్లి స్మారకార్థం ఆ లైబ్రరీని నిర్మించారు. పౌర హక్కుల కార్యకర్తగా ఆమె నాకు పరిచయమే. సాధారణంగా నేను మావోయిస్ట్‌-నక్సలైట్‌ గ్రూప్‌ సమావేశాలకు హాజరు కాను. కేవలం రంగవల్లి మీద ఉన్న గౌరవాభిమానాలతోనే అందుకు ఒప్పుకున్నాను. మూడు రోజుల తర్వాత విమలక్క నుంచి ఓ వాట్సప్‌ సందేశం వచ్చింది. సాక్షిలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా అంశంపై రాసిన వ్యాసంపై పునరాలోంచుకోవాలని విమలక్క నాకు సూచించారు. దానికి నేను గట్టిగానే జవాబిచ్చాను. అది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడం వారి ఇష్టం అని చెప్పాను. విమలక్క దీనికి సమాధానం ఇవ్వలేదు కానీ తర్వాత నాకు పిలుపు రాలేదు. వామపక్ష ఉదారవాదులు ఛాందసవాద ముస్లిం యువతతో చేతులు కలిపి నా భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అనుచితమైన రాతలు రాస్తున్నారు. నిజానికి భారతదేశంలో ఉన్న ముస్లింలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్న విషయం వారికి తెలియడం లేదు. ట్రంప్‌, మోదీ, నెతన్యాహు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇజ్రాయెల్‌ నుంచి యూధులను తరిమేయాలన్నది వామపక్షాల అభిప్రాయం. అక్కడ పాలస్తీనీయులకు మాత్రమే హక్కు ఉంది. 1948లో ఇజ్రాయెల్‌లో యూధులు నివసించడాన్ని అంబేద్కర్‌ సమర్థించిన విషయం వారికి తెలియదు. మార్క్స్‌, లెనిన్‌లు యూదుల గురించి ఏమి చెప్పారో కూడా వారు చదువుకుని ఉండరు. వారు ఆ ఆజ్ఞానంలోనే ఆనందంగా బతికేస్తామని అనుకుంటే అది వారి ఇష్టం. కానీ నన్ను అవమానించే హక్కు వారికి లేదు. నా భావప్రకటనా స్వేచ్ఛను, నా ఆత్మగౌరవాన్ని అవమానపరిచే హక్కు మాత్రం వారికి లేదు. నా అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాను. ఎవరైనా ఈ విషయంపై నాతో చర్చించవచ్చు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను.

Eha Tv

Eha Tv

Next Story