సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) కాసింత కనికరం చూపారు. తెలుగుదేశంపార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు(Nara lokesh) అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో(Inner Ring Road Case) సీఐడీ(CID) విచారణ తర్వాత లోకేశ్‌ హడావుడిగా ఢిల్లీకి(Delhi) వెళ్లారు.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) కాసింత కనికరం చూపారు. తెలుగుదేశంపార్టీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు(Nara lokesh) అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో(Inner Ring Road Case) సీఐడీ(CID) విచారణ తర్వాత లోకేశ్‌ హడావుడిగా ఢిల్లీకి(Delhi) వెళ్లారు. అప్పట్నుంచి ఓ అయిదారు రోజులు తప్పిస్తే అక్కడే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడును(Chandrababu) సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్‌ చేశారు. ఆ నెల 14న లోకేశ్‌ ఢిల్లీకి వెళ్లారు. జాతీయ నేతలను కలిసే ప్రయత్నం చేశారు కానీ వారెవ్వరూ లోకేశ్‌ను కలిసేందుకు ఆసక్తి కనబర్చలేదన్నది టాక్‌! బీజేపీ(BJP) పెద్దలను కూడా కలసి గోడు వినిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.

అమిత్‌షాను కలిశారు. తన తండ్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌ గురించి చెప్పారు. తన కుటుంబసభ్యులపై కూడా అన్యాయంగా, అక్రమంగా కేసులు నమోదు చేశారని విన్నవించుకున్నారు. లోకేశ్‌ చెప్పింది అమిత్‌షా చాలా శ్రద్ధగా విన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత అమిత్ షా అపాయింట్‌మెంట్‌కు నెల రోజులకు పైగా సమయం పట్టింది. ఇన్ని రోజుల పాటు లోకేశ్‌కు దర్శనభాగ్యం కల్పించకుండా ఆకస్మాత్తుగా అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఎందుకు ఇచ్చారు? అన్న సందేహం చాలా మందిని వెంటాడుతోంది. దీని వెనుక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. షెడ్యూల్‌ విడుదలైన మరుక్షణం నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సంసిద్ధమయ్యాయి.

వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉబలాటపడుతున్న బీజేపీకి అందుకోసం అన్ని దారులను వెతుక్కుంటున్నది. ఈ ఎన్నికల్లో కొద్దో గోప్పో రాజకీయ ప్రయోజనం పొందాలంటే లోకేశ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వక తప్పదని బీజేపీ పెద్దలు గ్రహించారు. అమిత్‌షాకు లోకేశ్‌ తన ఆవేదనను వెలిబుచ్చుకుంటున్నప్పుడు తెలంగాణ బీజేపీ(TS BJP) అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి(Kishan Reddy), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిలు(Purandeshwari) కూడా ఉన్నారంటేనే ఏ ప్రయోజనం ఆశించి లోకేశ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారో అర్థమవుతోంది. తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌పై కమ్మ సామాజివకర్గం కోపంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును అరెస్ట్‌ చేసినప్పుడు కేసీఆర్‌ మాట్లాడకపోవడం ఇందుకు కారణం.

ఎంతకాదనుకున్నా చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రియ శిష్యుడే. ఇప్పుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. అంచేత కమ్మ సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్‌వైపుకు వెళతాయన్న చర్చ అయితే జరుగుతోంది. ఇటీవల మాజీ ఎంపీ రేణుకా చౌదరి సారథ్యంలో కమ్మ సామాజికవర్గం నేతలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ అగ్రనాయకులను కలిశారు.తెలంగాణలో ఇంచుమించు 30 నుంచి 40 నియిఓజకవర్గాలలో కమ్మ సామాజికవర్గం ఎన్నికలలో ప్రభావం చూపిస్తుందని చెప్పారు. తమకు హీనపక్షం పది సీట్లు కేటాయించాలని అభ్యర్థించారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కొందరు ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. దీనికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

పైగా దీనిపై మంత్రి కేటీఆర్‌ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవన్నీ కమ్మ సామాజికవర్గంలో అసంతృప్తిని రగిలించాయట! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో కేసీఆర్‌ ఉన్న స్నేహబంధం కారణంగానే తెలంగాణలో తమకు అనుమతి ఇవ్వడం లేదని కమ్మ సామాజికవర్గం భావిస్తోంది. అందుకే వారంతా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే తెలంగాణ బీజేపీ అలెర్టయ్యింది. కాంగ్రెస్‌కు లాభం కలగకుండా ఉండేందుకు, కమ్మ సామాజికవర్గంలో తమపై ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చుకునేందుకు అమిత్‌షా లోకేశ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమిత్‌షాతో లోకేశ్‌ సమావేశమైన తర్వాత తెలంగాణ కమ్మ సామాజికవర్గం రాజకీయ అభిప్రాయాలు ఏమైనా మారతాయా? కాంగ్రెస్‌కు నై చెప్పి బీజేపీకి సై అంటారా? అన్నది వేచి చూడాలి.

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 5:58 AM GMT
Ehatv

Ehatv

Next Story