1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ ఉమ్మడి డిమాండ్‌ మేరకు అంతకు ముందే భారత్‌(Bharath)-పాకిస్తాన్‌(Pakistan) విభజనకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1937 లో సావర్కర్ Two Nation Theory గురించి గుజరాత్ లోని కార్నావతిలో జరిగిన హిందూమహాసభ కన్వెన్షన్ లో చెప్పాడు. దేశ విభజనను గాంధీ ఎంతగా వ్యతిరేకించినా జరగాల్సింది జరిగింది.

1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ ఉమ్మడి డిమాండ్‌ మేరకు అంతకు ముందే భారత్‌(India)-పాకిస్తాన్‌(Pakistan) విభజనకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1937 లో సావర్కర్ Two Nation Theory గురించి గుజరాత్ లోని కార్నావతిలో జరిగిన హిందూమహాసభ కన్వెన్షన్ లో చెప్పాడు. దేశ విభజనను గాంధీ ఎంతగా వ్యతిరేకించినా జరగాల్సింది జరిగింది. 1937, ఆగష్టు 3న లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య ప్రణాళికను సమర్పిస్తూ, భారతదేశం స్వతంత్ర దేశం కానున్నదని, అలాగే దేశం రెండు భాగాలుగా విడిపోతుందని తెలిపారు. లార్డ్ మౌంట్ బాటన్ అందించిన ప్రణాళికను జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా అంగీకరించక తప్పలేదు. కాకపోతే విభజన అంత ఈజీగా జరగలేదు.

పాకిస్తాన్‌కు ఏ ప్రాంతాలు చెందాలో? భారత్‌లో ఏ ప్రాంతాలు ఉండాలో నిర్ణయంచడం చాలా కష్టమయ్యింది. దీనిపై కూడా చాలా చర్చలు జరిగాయి. చివరాకికి హిందూ-ముస్లిం జనాభా ప్రాతిపదికన విభజన చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక్కడో మరో సమస్య వచ్చింది. హిందూ- ముస్లిం జనాభా సమానంగా ఉన్న చోట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. చివరికి సరిహద్దు గీత గీసే బాధ్యతను బ్రిటిష్‌(Brittish) ప్రభుత్వం సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌కు(Cyril Radcliffe) ఇచ్చింది. రాడ్‌క్లిఫ్‌కు భారత్‌పై పూర్తి అవగాహన ఉందనుకునేరు. ఆయన ఒక్కసారికి కూడా భారత్‌ను సందర్శించలేదు. అసలు మన దేశంలో ఉన్న భిన్న జాతులు, విభిన్న సంస్కృతుల గురించి ఆయనకు పిసరంత కూడా తెలియదు.

జనాభా కూడా తెలియదు. బ్రిటన్‌లోని వేల్స్‌లో నివాసం ఉండే రాడ్‌క్లిఫ్‌ వృత్తి రీత్యా న్యాయవాది. ఈయన తండ్రి ఆర్మీ కెప్టెన్‌. బ్రిటన్‌లోని హాలీ బెర్రీ కాలేజీలో చదువుకున్న రాడ్‌క్లిఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా స్థిరపడ్డారు. ప్రముఖ కేసులను టేకప్‌ చేయడం వల్ల నలుగురికి తెలిశారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో సమాచార మంత్రిత్వ శాఖలో చేరాడు. 1941లో డైరెక్టర్‌ జనరల్‌ అయ్యారు. 1945లో మళ్లీ న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. ఆ తర్వాత
భారతదేశ సరిహద్దు రేఖ గీసే బాధ్యతను అందిపుచ్చుకున్నారు.

రెండు సరిహద్దు కమిషన్లకు ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. రాడ్‌క్లిఫ్‌కు ఇద్దరు హిందువులు, ఇద్దరు ముస్లిం లాయర్లను సహాయకుడిగా నియమించారు. 1947, జూలై 8న ఇండియాకు వచ్చారు రాడ్‌క్లిఫ్‌.. అయిదు వారాలలో విభజన రేఖను గీసే బాధ్యత ఆయనకు అప్పగించారు. జనాభా పరంగా బెంగాల్‌, పంజాబ్‌లను విభజించడం అంత సులభంగా జరగలేదు. ఎందుకంటే పంజాబ్‌, బెంగాల్‌లలో హిందువులు, ముస్లింలు సమానంగా ఉన్నారు. మొత్తంగా తనకు ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ 1947, ఆగస్టు 12న సరిహద్దు గీత గీయడాన్ని పూర్తి చేశారు రాడ్‌క్లిఫ్‌.

ఈ విభజన రేఖను 1947, ఆగస్టు 17న జనం ముందు వచ్చారు. ఈ సరిహద్దు రేఖకు రాడ్‌క్లిఫ్‌ లైన్‌(Radcliffe Line) అని పేరు పెట్టారు. లాహోర్‌(Lahore) నగరంలో హిందువులే ఎక్కువగా ఉండేవారు. లాహోర్‌ పాకిస్తాన్‌లో ఉంటుందా? భారత్‌లో ఉంటుందా అన్నదానిపై పెద్ద చర్చ జరిగింది. విభజన సన్నాహక సమయంలో లాహోర్‌ నగరాన్ని భారత్‌లో చేర్చారట రాడ్‌క్లిఫ్‌. అయితే పాకిస్తాన్‌లో పెద్ద నగరం లేదని గమనించి లాహోర్‌లో పాకిస్తాన్‌కు ఇవ్వాలని డిసైడయ్యారట. ఈ విషయాన్ని రాడ్‌క్లిఫ్‌ స్వయంగా తెలిపారు.

వచ్చిన రెండు రోజుల వరకు లాహోర్‌ నగరం భారతదేశ భూభాగంగానే ఉండింది. తర్వాతే అధికార ప్రకటనతో అది పాకిస్తాన్‌కు చేరింది. విభజన తర్వాత రాడ్‌క్లిఫ్‌ బ్రిటన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎప్పుడూ భారత్‌కు రాలేదు. కానీ ఆయన గీసిన గీత మాత్రం ఎన్నో కోట్ల మంది నుదిటి గీతను మార్చింది. భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు, పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు కోట్లాది మంచి తరలి వెళ్లారు. కన్న చోటును, ఉన్న ఊరును వదిలేసి కట్టుబట్టలతో వెళ్లారు. సరిహద్దుల్లో లక్షలాది మంది చనిపోయారు. మనిషి సృష్టించిన అతి పెద్ద వైపరిత్యం ఇదే! విలయం కూడా ఇదే!

Updated On 16 Sep 2023 5:21 AM GMT
Ehatv

Ehatv

Next Story