పేటీఎంకి(Paytm) చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు(Paytm Payments Bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు(Deposit) తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు(Prepaid plans), వాలెట్లు(Wallet), ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్-అప్‌లను స్వీకరించకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయట ఆడిటర్లు నిర్వహించిన నివేదికలను అనురసించి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.

పేటీఎంకి(Paytm) చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుకు(Paytm Payments Bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు(Deposit) తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు(Prepaid plans), వాలెట్లు(Wallet), ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్-అప్‌లను స్వీకరించకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయట ఆడిటర్లు నిర్వహించిన నివేదికలను అనురసించి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. బ్యాంకులో నిబంధనలు ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎస్‌సీఎంసీ కార్డ్‌లు మొదలైన వాటిలో వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, రీఫండ్‌లు తప్ప డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లు అనుమతించబడవని తెలిపింది. తమ నోడల్ ఖాతాలను వీలైనంత త్వరగా ఫిబ్రవరి 29లోపు రద్దు చేసుకోవాలని One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌లను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే అన్ని లావాదేవీలు, నోడల్ ఖాతాల సెటిల్‌మెంట్‌ను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఇంత పెద్ద వార్తను నేషనల్‌ మీడియా ప్రసారం చేయడానికి జంకింది. ఎందుకంటే పేటిఎంను ప్రమోట్‌ చేసింది ప్రధాని మోదీ కావడం. అప్పుడు పేటీఎం కూడా తమ వాణిజ్య ప్రకటనకు మోదీ ఫోటోను వాడుకుంది. నోట్ల రద్దు సమయంలో ప్రధానమంత్రి మోదీనే(Narendra modi) స్వయంగా పేటీఎంను వాడండి అంటూ చెప్పారు. ఆ సమయంలో రాహుల్‌గాంధీ పేటీఎంకు కొత్త నిర్వచనం చెప్పారు. పే టీ ఎం అంటే పే టు మోదీ అని రాహుల్ చెప్పారు. ఎక్కువ రోజులు నిలవదని కూడా అన్నారు. అప్పుడు బీజేపీ నేతలు గాయ్‌గత్తర చేసిన బీజేపీ నేతలు ఇప్పుడేమంటారు?

Updated On 1 Feb 2024 5:20 AM GMT
Ehatv

Ehatv

Next Story