2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు(Demonitization) తర్వాత వాలెట్లు వాడకంలోకి వచ్చాయి. యూపీఐడీ(UPID) ద్వారా చెల్లింపులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రజల రోజువారీ జీవితాల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ భాగమయ్యాయి. చిన్న చిన్న షాపులు, టీ స్టాళ్ల నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ ప్రజలు యూపీఐ ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వివరాల ప్రకారం 2023 నవంబర్ నెలలో 17 ట్రిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. యూపీఐ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించేందు క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. జనవరి 1, 2024 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.

పొరపాటున మనం తెలియని లేదా కొత్త యూజర్లకు(New Users) డబ్బు పంపిస్తే వాటిని తిరిగి ఎలా సాధించాలన్న అంశంపై ఆర్‌బీఐ(RBI) కొత్త నిబంధనను రూపొందించింది. అదేంటంటే, తెలియని లేదా కొత్త యూజర్‌కు మధ్య తొలి సారి డిజిటల్ పేమెంట్స్ రూ.2 వేల కంటే ఎక్కువగా చేయాలనుకుంటే ఇప్పటి నుంచి 4 గంటల పాటు వేచి ఉండాలి. ఒకవేళ పొరపాటున గనుక వేరే యూజర్‌కు 2 వేల లోపు పేమెంట్ చేస్తే ఈ 4 గంటల సమయంలోగా వాటిని తిరిగి పొందేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్‌పీసీఐ వెల్లడించింది.
మరో నిబంధన ఏంటంటే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు ఉపయోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్(UPI Deactivate) చేయాలని బ్యాంకులు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లకు ఎన్‌పీసీఐ ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే యూపీఐ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా ఎలా చేస్తామో, అలాగే మొబైల్‌తో యూపీఐ ఏటీఎంపై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ డబ్బును డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ పెంపు ఈ ఏడాది అమలులోకి వచ్చింది. త్వరలోనే ట్యాప్ అండ్ పే(Tap and Pay) విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామని ఎన్‌పీసీఐ తెలిపింది.